సెప్టెంబర్ 7 భాద్రపద మాస శనివారం శుక్లపక్ష చవితి పగలు 1: 51 వరకు తదుపరి పంచమి చిత్తా నక్షత్రం ఉదయం 10:27 వరకు తదుపరి స్వాతి నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 5:49 నుండి 7:27 మధ్య కలదు వినాయక చవితి పర్వదినం శనివారం చిత్తా నక్షత్రం కాల యోగం కార్యాహాని స్వాతి నక్షత్రం సిద్ధయోగం కార్యసిద్ధి కనక ఉదయం 11 తర్వాత ప్రయాణాలు అనుకూలం వినాయక చవితి రోజు పెద్ద పెద్ద విగ్రహాలు ఎన్ని పెట్టిన తప్పనిసరిగా మట్టితో చిన్న ప్రతిమ ఉండాలి నిమజ్జనం చేసేటప్పుడు ఎన్ని రకాల ప్రతిములున్నప్పటికీ మట్టి బొమ్మ లేకపోతే ఆ నిమజ్జనం వ్యర్థమైపోతుంది గణనాధుని ఏక వింశతీపత్రాలు అంటే ఇరవై ఒక్క వనమూలికలను వినాయక చవితి రోజున పూజలో ఉపయోగించడం వలన ఇవి ఆయుర్వేద గుణాలు కలిగిన వి కాబట్టి మనకి ఆరోగ్యము కలగజేస్తుందని గురువచనము వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్ని రాశుల వారు ఆ గణనాధుని శోడశోపచార పూజలతో ఆరాధించి పనులు యందు విజ్ఞాలు తొలగించుకుని ముందుకు సాగుతారు అని ఆశిస్తు…