ఆగస్టు 8 శ్రావణమాస గురువారం శుక్లపక్ష చతుర్థి రాత్రి 9:51 వరకు తదుపరి పంచమి ఉత్తర పాల్గొని నక్షత్రం రాత్రి 10:10 వరకు తదుపరి హస్తా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 9:58 నుండి 10:49 మధ్యగలదు నాగ చతుర్థి పర్వదినం గురువారం ఉత్తరా ఫల్గుణి నక్షత్రం మాతంగ యోగం స్వర్ణ లాభం హస్తా నక్షత్రం రాక్షసయోగం క్లేశము కనుక రాత్రి 10 10 లోపు ప్రయాణాలు అనుకూలం మనం భగవంతునితో గడిపే కాలం నిజమైన ఆయువుగా పరిగణలోకి తీసుకోవాలి అంటే ప్రతిరోజు పూజ జపం గ్రంధ లేదా స్తోత్ర పారాయణములు ఆలయ దర్శనం పురాణ ప్రవచనం వినడం పురాణ విశేషాలు చర్చ లేదా వాటిని ఇతరులకు చెప్పడం ఆలయం శుభ్రం చేయడం ఇతరులకు తోచిన సహాయం చేయడం మొదలైన వాటిలో ఏదైనా చేశామో లేదో అని ఆలోచించాలని గురువచనము మకర రాశి వారు ఆంజనేయ స్వామి వారికి వడమాల సమర్పించి సుందరకాండ మును పారాయణం చేసిన ప్రభుత్వ సంబంధించిన ఎలాంటి పనులైనా తప్పకుండా అనుకూలిస్తాయి