జనవరి 3 పుష్య మాస శనివారం శుక్లపక్ష పౌర్ణమి సాయంత్రం 4:23 వరకు తదుపరి బహుళ పాడ్యమి ఆరుద్ర నక్షత్రం సాయంత్రం 6:53 వరకు తదుపరి పునర్వాస నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 6:35 నుండి 8:30 మధ్య కలదు శనివారం ఆరుద్ర నక్షత్రం ముద్గర యోగం మరణము పునర్వాసు చత్ర యోగం రాజ్య లాభం కనుక సాయంత్రం 7తర్వాత ప్రయాణాలు అనుకూలం
పంచాంగం మొత్తం తెలియకపోయినా కొన్ని యోగాలు మాత్రం తెలుసుకొని ప్రయాణములు కానీ శుభకార్యాలు చేసుకుంటే చాలా వరకు శుభమే జరుగుతుంది వీటినే అమృత సిద్ధ యోగములని అంటాము ఇది ఆదివారము హస్తా నక్షత్రము అంటే హస్తా నక్షత్రంతో కలిసిన ఆదివారం రోజు ఏ పని మొదలుపెట్టిన శుభమే జరుగుతుంది అలానే సోమవారం రోజు మృగశిర మంగళవారం రోజు అశ్విని బుధవారం రోజు అనురాధ గురువారం రోజు పుష్యమి శుక్రవారం రోజు రేవతి నక్షత్రం అంటే రేవతి నక్షత్రం తో కూడా శుక్రవారం రోజు శుభకార్యాలు పెద్దవి కాకపోయినా పెళ్లిచూపులు ఏదైనా ప్రయాణాలు మొదలు పెట్టుట చిన్న చిన్న పనులు మొదలు పెట్టడం వ్యాపార విస్తరణలు తీర్థయాత్రలో చేయుట ఇలాంటి చిన్నచిన్న శుభకార్యాలకు అనుకూలిస్తాయి అలానే రోహిణి నక్షత్రంతో కూడిన శనివారము అమృత సిద్ధ యోగమే ని చెపుతారు అయితే ఈ యోగాలు సర్వ కార్యములకు శుభమే కాని ఇందులో కొన్ని అంటే పుష్యమి నక్షత్రం తో కలిసిన గురువారం నాడు వివాహం మాత్రం చేయరాదు అలానే రోహిణి నక్షత్రంతో కూడిన శనివారము ప్రయాణాలు చేయరాదు. ప్రయాణాలు అంటే దూర ప్రయాణాలు బయట విదేశాలకు వెళ్లడం లాంటి ప్రయాణాలు ఇంకా తీర్థయాత్ర లాంటి ప్రయాణాలు కి మంచిది కాదని అశ్విని నక్షత్రం కలిసి న మంగ్లవారం వస్తే ఆ రోజు గృహారంభం చేయరాదని శాస్త్రం అట్లానే సమస్త శుభకార్యాలకు శుభ నక్షత్రాలు ఏమంటే మఖ మృగశిర రోహిణి హస్త స్వాతి మూల అనురాధ రోహిణి
రేవతి ఉత్తర ఉత్తరాషాడ ఉత్తరాభాద్ర
పుష్యమి అశ్విని చిత్త ధనిష్ట శ్రవణ
ఈ నక్షత్రములందు సమస్త శుభకార్యాలు చేయుటకు చాలా అనుకూల ఫలితాలు కలుగుతాయి ఇందులో యజమాని యొక్క నక్షత్రం నుండి ఆ రోజు నక్షత్రాన్ని గల బలం అంటే తారాబలం చంద్రబలం చూసుకొని కార్యక్రమాలు మొదలుపెట్టాలి
గోచారంలో చంద్రుడు గురు గ్రహముతో పాటు మిధున రాశిలో సంచారం వలన వృషభ మిధున సింహ తులా కుంభ మీన రాశి వారికి శుభకాలము వీరు గోమాతకు సేవ చేయడం వలన లేదా గురువులను సేవించడం వలన విపరీత రాజయోగం గజకేసరే యోగం ప్రాప్తిస్తుంది మరింత శుభాలు శీఘ్రముగా పొందుతారు