Edit Content
Click on the Edit Content button to edit/add the content.

01/01/26 ఫలాస పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్ | రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ||

జనవరి 1 పుష్య మాస గురువారం శుక్లపక్ష త్రయోదశి రాత్రి 8:45 వరకు తదుపరి చతుర్దశి రోహిణి నక్షత్రం రాత్రి 9:50 వరకు తదుపరి మృగశిర నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 10 13 నుండి 10 57 మధ్య కలదు గురువారం రోహిణి నక్షత్రం ఉత్పాతయోగం ద్రవ్యనాశనం మృగశిర మృత్యుయోగ మహాని కనక ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది
ఫలాస పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్ | రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ||
ఫలాస పుష్ప సంకాశం  పలాశ పుష్పం (మోదుగ పువ్వు) వలె ప్రకాశించే.
తారకాగ్రహమస్తకమ్  నక్షత్రాలను, గ్రహాలను తలపై ధరించినవాడు.
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం ఉగ్రమైన, ఉగ్ర రూపంతో, భయంకరమైన.
తం కేతుం ప్రణమామ్యహమ్ అటువంటి కేతు గ్రహానికి నమస్కరిస్తున్నాను. 
పలాశ పుష్పం మోదుగ పువ్వు రంగులో, నక్షత్రాలను తలపై ధరించినట్లుగా, ఉగ్రరూపంలో, భయంకరంగా ఉండే కేతు గ్రహాన్ని నమస్కరించుచున్నాను సాధారణంగా జాతకంలో కేతు దోష నివారణకు, జ్ఞానం, మోక్షం కోసం పఠించబడుతుంది.  కేతు గ్రహము జాతకంలో శుభ స్థానంలో సంచారం చేస్తుంటే మోక్షాన్ని ప్రసాదిస్తాడు నేర్పు చిత్రలిపియందు,మంత్ర తంత్రాలు మూఢభక్తి చక్కటి కళ్ళు సుస్వప్నాలు కలగడం అందమైన ముక్కు దైవభక్తి వేదాంత విచారణ బహుదేవతారాధన యోగాభ్యాసం జ్ఞానము అన్య భాషల యందు ప్రవేశం అతి తక్కువ తినడం అల్పాహారం చేయడం చురుకుతనము వైద్యవృత్తి భోగభాగ్యాలు శైవ దీక్ష కీర్తి స్నేహముల యందు లాభము బ్రహ్మవిద్య అభ్యసించుటకు అభిమానము పితామహులు అంటే తాతలు తండ్రులతో చక్కటి అనుబంధం కలుగుతుంది అదే కేతు గ్రహం నీచ పట్టున నీచులతో కలిసి ఉంటే ఆలస్యము జడత్వము నిద్ర సంబంధించిన రోగాలు వేదముల యందు దేవుడు యందు భక్తి లేకపోవుట కిరాతకం పాషాణ మతాలు అవలంబించుట శత్రుభాధ చపలత్వం విపరీతమైన ఆకలి లోబత్వం మిత్రభేదం అపకీర్తి స్నేహ నష్టం తండ్రులతోనూ తాతలతోనూ విభేదాలు లాంటి ఇబ్బందులు కలగజేస్తాడు ఇందుకుగాను కేతు గ్రహ శాంతి కోసం కేతు గ్రహానికి అధిదేవత అయిన వినాయకుడు పూజించాలి చతుర్ధి తిథియందు వినాయక స్వామి వారికి గరిక సమర్పించి భక్తిశ్రద్ధలతో భుజంగ స్తోత్రాన్ని వింటూ 108 ప్రదక్షిణలు చేసి గుడిలో వాయువ్యం యందు దీపారాధన చేయడం మరియు దైవ సమానులైన తండ్రితో కానీ తాతలతో గాని గురువులతో కానీ వినయ విధేయులై ఉండడం తరచూ వినాయక స్వామి వారి గుడిని సందర్శించడం లేదా కేతు గ్రహ యంత్రాన్ని తయారు చేయించుకుని ఉలవలు గుట్టగా పోసి అష్టదళ పద్మం ముగ్గు ముగ్గు పోయిన విస్తరా విస్తరణ పై ఉలవలు నాలుగు దోసెల్లో గుట్టగా పోసి యంత్రం పెట్టి మట్టి ప్రమిదలు ఏడు వత్తులు కలిపి అమర్చి ఆవు నెత్తితో దీపారాధన చేసి పై చెప్పబడిన స్తోత్రాన్ని వజ్రాసనంలో 41 రోజు పాటు భక్తిశ్రద్ధలతో పఠించాలి మండలం దీక్ష తర్వాత ఈ యంత్రాన్ని పశ్చిమం పారే నీళ్లలో నిమర్జించి అన్నదానం చేస్తే కేతుగృహ శాంతి కలిగి కేతు గ్రహ అనుగ్రహంతో సర్వసభాలు చేకూరుతాయి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top