Edit Content
Click on the Edit Content button to edit/add the content.

31/12/25 అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనమ్ ।సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్డి

డిసెంబర్ 31 పుష్యమాస బుధవారం శుక్లపక్ష ద్వాదశి రాత్రి 11:10 వరకు తదుపరి త్రయోదశి కృతికా నక్షత్రం రాత్రి 11:35 వరకు తదుపరి రోహిణి నక్షత్రం దుర్మూర్తం 11:40 నుండి 12 24 మధ్యగలదు బుధవారం కృత్తికా నక్షత్రం సిద్ధయోగం కార్యసిద్ధి రోహిణి శుభయోగం శుభకార్యసిద్ధి కనుక ప్రయాణాలు అనుకూలం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనమ్ ।
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ॥
అర్ధకాయం: సగం శరీరం కలవాడు.
మహావీరం: గొప్ప వీరుడు.
చంద్రాదిత్య విమర్ధనమ్: చంద్రుడిని, సూర్యుడిని అణచివేసేవాడు అంటే గ్రహణాలకు కారణమయ్యేవాడు.
సింహికా గర్భ సంభూతం: సింహిక అనే రాక్షసి కడుపులో పుట్టినవాడు.
తం రాహుం ప్రణమామ్యహమ్: అలాంటి రాహుడికి నమస్కరిస్తున్నాను.
సగం శరీరంతో, మహావీరుడిగా, చంద్రుడిని, సూర్యుడిని అణచివేసేవాడిగా, సింహిక గర్భంలో పుట్టినవాడిని అయిన రాహుడికి నమస్కరిస్తున్నాను రాహు గ్రహము జాతక చక్రంలో 9వ స్థానంలో సంచరిస్తుండగా లగ్నం నుండి తొమ్మిదవ స్థానంలో సంచరిస్తుండగా జన్మించిన శిశువుకి రాహు దోషము వర్తిస్తుంది ఇది తండ్రికి గండం గా కానీ లేదా 12 సంవత్సరాలలోపు రాహు మహర్దశ వస్తే శిశువుకి బాలా నిష్ఠ దోషముగా చెబుతారు జాతకంలో శుభ స్థానసంచారం వ్యాపార విస్తరణలు విదేశీ సంబంధాలు సాంకేతికత మరియు రహస్య ఒప్పందాలు కలలు సృజనాత్మకత ఉన్నతమైన కీర్తిని ఇవ్వగలరు రాహు ప్రభావం అనుకూలంగా లేకపోతే అంతా గందరగోళాలు భయాలు మరియు వ్యసనాలకు దారితీస్తుంది శరీరంలో మెదడు
నాడీ వ్యవస్థ ఊపిరితిత్తులు గొంతు మానసిక రుగ్మతలు భయాలు భ్రాంతులు ఊపిరితిత్తు సమస్యలు విష సంబంధిత రోగాలు లాంటి ఇబ్బందులు పడవలసి వస్తుంది ఈ దోషం నుండి బయటపడడానికి కుక్కే సుబ్రమణ్య స్వామి గుడిలో రాహు శాంతి చేసుకోవడం వలన లేదా శ్రీకాళహస్తి శ్రీశైలంలాంటి దివ్య క్షేత్ర దర్శనాలు లతో చాలా వరకు తీవ్రత తగ్గుతుంది లేదా రాహు గ్రహ యంత్రాన్ని తయారు చేయించి జన్మతిది నక్షత్రం రోజు రాహుకాల మందు అష్ట గల పద్మం ముగ్గు పైన విస్తరణ వేసి విస్తరణలో దోషం గల వారి దోసెలతో నాలుగు దోసెల మినుములు గుట్టగా పోసి దానిపైన ఈ యంత్రాన్ని పెట్టి మట్టి ప్రమిదలో 3 త్తులు అమర్చి 4 రకాల నూనెలతో దీపారాధన చేసి వినాయక స్వామిని ప్రార్థించి గురువుకు నమస్కరించుకొని పై చెప్పబడిన రాహు స్తోత్రాన్ని భక్తిశ్రద్ధలతో వజ్రాసనంలో41 రోజులు ప్రతి రాహుకాలమందు జపించాలి ప్రతి వారమును మినుములు తీసి వేరే నువ్వులు పోసి తీసివేసిన మినుములు ఉడకబెట్టి గోమాతకి తినిపించి గోపంచతం చల్లుకవాలి మండలం రోజుల తర్వాత ఏదైనా గుడిలో అన్నదాన కార్యక్రమాలు చేస్తే రాహు గ్రహ అనుగ్రహం కలిగి సర్వ శుభాలు చేకూరుతాయి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top