Edit Content
Click on the Edit Content button to edit/add the content.

27/12/25 నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం|ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం

డిసెంబర్ 27 పుష్య మాస శనివారం శుక్లపక్ష సప్తమి ఉదయం 9 గంటల వరకు తదుపరి అష్టమి ఉత్తరాభాద్ర నక్షత్రం తెల్లవారుజామున 5 గంటల 10 నిమిషాల వరకు తదుపరి రేవతి నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 6:31 నుండి 7:59 మధ్య శనివారం ఉత్తరాభాద్ర నక్షత్రం ధూమ్రయోగ యోగం హాని రేవతి నక్షత్రం దాత్రియోగం కార్యసిద్ధి కనక ఉదయం 5:10తర్వాత ప్రయాణాలు అనుకూలం
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం|ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం
నీలాంజన సమాభాసం: నీలి రంగు కాటుకలా ప్రకాశించేవాడు.
రవిపుత్రం: సూర్యుని కుమారుడు.
యమాగ్రజం: యముడికి అన్నయ్య.
ఛాయా మార్తాండ సంభూతం: ఛాయా దేవికి, సూర్యునికి జన్మించినవాడు.
తం నమామి శనైశ్చరం: అటువంటి శని దేవునికి నమస్కరిస్తున్నాను. 
నీలం కాటుకలా మెరిసేవాడా, సూర్య భగవానుని పుత్రుడా, యముడికి సోదరుడా, ఛాయా దేవి, సూర్య భగవానులకు జన్మించినవాడా, అటువంటి శనిశ్వరుడికి నమస్కరిస్తున్నాను  శని ఒక వ్యక్తి జీవితకాలంలో చేసిన కర్మ ఫలితాన్ని తగిన శిక్షలు ద్వారా ప్రసాదిస్తాడు
ముక్కోటి దేవతలలో ఒకరైన శనైశ్చరుడిని త్రికరణ శుద్ధిగా పూజిస్తే అంతా శుభమే కలుగును. జాతక చక్రంలో శని భగవానుడు లగ్నంలో సంచరిస్తుంటే బాలారిష్ట దోషము అంటారు మరియు ప్రతి మనిషికి ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని తప్పకుండా సంభవించి బాధలు పెట్టడం జరుగుతుంది. దీనికి గాను శని నక్షత్రాల కలిసిన శనివారం రోజు శనిహోరా సమయం అంటే ఉదయం 6 7 మధ్యన జమ్మిచెక్క చేత తయారు చేయబడిన ప్రమిదలో ఎరుపు నలుపు తెలుపు దారం ఒత్తిగా అమర్చి అష్టదళ పద్మం ముగ్గు పైన విస్తరవేసి శని దోషమున్న వారి దోసెలతో నాలుగు దోసెల్లో నల్ల నువ్వులు గుట్టగా పోసి దానిపైన ఈ ప్రమిదను పెట్టి నువ్వుల నూనె ఆముదం ఆవు నెయ్యి ఈ మూడు రకాలైన నూనెల చేత దీపారాధన చేసి వినాయక స్వామిని ఆరాధించి గురు మంత్రాన్ని స్మరించుకొని పై చెప్పబడిన శని స్తోత్రాన్ని భక్తిశ్రద్ధలతో వజ్రాసనంలో జపించాలి. ఇలా 41 రోజు చేసిన తర్వాత ఈ  దీపాన్ని పశ్చిమం పారే నీళ్లు అంటే నదములలో నిమర్జించాలి. ప్రతి శనివారం రోజు నువ్వులు తీసివేసి తీసివేసిన నువ్వుల దగ్గర వేరే నువ్వులు పోసి తీసివేసిన నువ్వులను బెల్లం కలిపి దంచి గోమాతకు తినిపించి గోపంచీకాన్ని తలపై చల్లుకోవాలి ఇలా భక్తిశ్రద్ధలతో నిష్టతో శని భగవానుని పూజిస్తే శని గ్రహ అనుగ్రహంతో ఆరోగ్య సమస్యల నుండి బయటపడి అద్భుతమైన రాజయోగాన్ని ప్రసాదిస్తాడు మరియు అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం కుష్టి వ్యాధిగ్రస్తులకు అన్నదానం చేయడం కూడా ఉత్తమ ఫలితాలు పొందుతారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top