Edit Content
Click on the Edit Content button to edit/add the content.

26/12/25 హిమ కుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుమ్ |సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ || 

డిసెంబర్ 26 పుష్య మాస శుక్రవారం శుక్లపక్ష షష్టి ఉదయం 10 నిమిషాల వరకు తదుపరి సప్తమి పూర్వాభాద్ర నక్షత్రం తెల్లవారుజామున 5:55 నిమిషాల వరకు తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:40 నుండి 9:25 మధ్య కలదు శుక్రవారం పూర్వా బాద్రా నక్షత్రం దాంక్షయోగం విజ్ఞము ఉత్తరాభాద్ర ద్వజయోగం రాజ్య లాభం కనుక ఉదయం ఉదయం 5:55 తర్వాత ప్రయాణాలు అనుకూలం
హిమ కుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుమ్ |
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ || 
హిమ కుంద మృణాళాభం: మంచు (హిమ), మొల్ల పువ్వు (కుంద), తామర కాడ (మృణాళ) వంటి తెల్లని కాంతి కలవాడు.
దైత్యానాం పరమం గురుమ్: రాక్షసులకు (అసురులకు) అత్యంత గొప్ప గురువు.
సర్వశాస్త్ర ప్రవక్తారం: అన్ని శాస్త్రాలను బోధించేవాడు.
భార్గవం: భృగు మహర్షి కుమారుడైన భార్గవుడిని (శుక్రుడిని).
ప్రణమామ్యహమ్: నమస్కరిస్తున్నాను. 
చల్లని మంచులా, మొల్ల పువ్వు వలె, తామర కాడ వలె తెల్లగా ప్రకాశిస్తూ, అసురులకు గురువుగా ఉండి, సమస్త శాస్త్రాలను బోధించే భార్గవుడికి (శుక్ర గ్రహానికి) నేను నమస్కరిస్తున్నాను. 
శుక్ర గ్రహము మానవుని జీవితంలో సంపద ప్రేమ సౌందర్యం సృజనాత్మకత వైవాహిక జీవితాన్ని ప్రసాదిస్తాడు జాతక చక్రంలో శుక్రుడు లగ్నం నుండి ఆరో స్థానంలో సంచరిస్తుంటే అది దోషముగా చెబుతారు దీనిని బృగుషట్క దోషము అంటాము దీనివలన ఆలస్య వివాహాలు వివాహమైన సరే పురుషులకైతే భార్య కోసం ఎంత చేసినా భార్య సంతోషంగా ఉండదు లోపాలు వెతకడమే పని పెట్టుకుంటుంది స్త్రీల అయితే భర్త సంతోషం కోసం ఎంత చేసినా ప్రయోజనం ఉండదు. అశాంతి అసహనమే మొదలు అవుతుంది పైకి సంసారం చేసినట్లు కనిపించిన వాళ్ల మధ్య సఖ్యత తక్కువగా ఉంటుంది అదే శుక్ర మహాదశ జరుగుతుంటే మరింత దారుణం…వస్తువులు పోగొట్టుకోవడం వాహనాలు నగలు మిస్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు దీనికి గాను శుక్ర నక్షత్రాలు కలిసిన శుక్రవారం శుక్ర హోర యందు అత్తి వృక్షము చెక్కచే తయారు చేయబడిన ప్రమిదలో ఆరు వత్తులు అమర్చి ఆవు నీతితో చేత అష్టదళ పద్మ ముగ్గు పైన విస్తరవేసి అందులో దోషం గల వారి దోసెలతో ఆరు దోసెల్లో అలసందుల గుట్టగా పోసి దాని పైన ఈ ప్రమిదలు పెట్టి దీపారాధన చేసి గణేశుని నమస్కరించి గురువు ప్రార్థించి శుక్ర గ్రహ స్తోత్రాన్ని భక్తిశ్రద్ధలతో 108 సార్లు 41 రోజులు పాటు జపించాలి రెండు పూటలా …
ప్రతి శుక్రవారం అలచందలు తీసి గుగ్గులు చేసి గుడిలో పంచాలి తీసివేసిన దగ్గర వేరే ఆలచందలు నింపాలి. ఇలా 41 రోజు తర్వాత తూర్పు పారే నీళ్లల్లో నిమర్జించిన శుక్ర గ్రహ అనుగ్రహం కలిగి అనుకున్న టైముకి వివాహమవుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలుగుతుంది లేదా బృగు పాశుపత హోమం కాని మహా పాశుపత హోంగాని చేయించుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందుతారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top