Edit Content
Click on the Edit Content button to edit/add the content.

25/12/25 దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభమ్। బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్॥ 

డిసెంబర్ 25 పుష్య మాస గురువారం శుక్లపక్ష పంచమి ఉదయం 10:40 వరకు తదుపరి షష్టి శతభిషా నక్షత్రం ఉదయం 6:20 వరకు తదుపరి  పూర్వాభాద్ర నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 10:10నుండి 10:53 మధ్య కలదు త్యాగరాజ స్వామి ఆరాధన మహోత్సవం గురువారం శతభిషా నక్షత్రం వజ్రయోగం కలహము పూర్వభద్ర ముద్గర యోగ మరణం గనక ప్రయాణాలు అనుకూలంగా లేవు
దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభమ్।
బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్॥ 
దేవానాం చ ఋషీణాం చ గురుం: 
దేవతలకు, ఋషులకు గురువు అయిన.
కాంచన సన్నిభమ్: బంగారు రంగులో ప్రకాశించే.
బుద్ధిభూతం: జ్ఞానానికి స్వరూపం.
త్రిలోకేశం: మూడు లోకాలకు అధిపతి.
తం నమామి బృహస్పతిమ్: అటువంటి బృహస్పతికి నేను నమస్కరిస్తున్నాను. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా బృహస్పతి దేవుని ఆశీస్సులు లభిస్తాయి.
ఇది జ్ఞానం, తెలివితేటలు, ఏకాగ్రత, వృత్తిలో విజయం మరియు ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయపడుతుంది.
జాతక చక్రంలో గురుడు లగ్నం నుండి మూడో స్థానంలో సంచరిస్తుంటే అది గురు దోషముగా బాల అరిష్ట దోషముగా చెబుతారు ఇలా ఉన్న శిశువుకి ఆరోగ్య విషయాలలో చాలా ఒడిదుడుకులు ఉంటాయి ఆకస్మికంగా అనారోగ్యం పాలవడం తినిన ఆహారం జీర్ణం లేకపోవడం తరచూ జ్వరము రావడం ఎంత తినిన పీలగా ఉండడం లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అంతేకాకుండా విద్యా స్థానంలో  సరైన స్కూల్ సెట్ కాకపోవడం విద్యా విజ్ఞాలు లాంటివి కలుగుతాయి మరియు వ్యాపారంలో ఒడిదుడుకులు పుత్ర నష్టము గుండెకు సంబంధించి షుగర్ లాంటి వ్యాధుల చేత ఇబ్బంది పడతారు కనుక వీరు గురు గ్రహ అనుగ్రహం కోసం రావు చెక్క చేత తయారు చేయబడిన ప్రమిదను అష్టదళ పద్మం ముగ్గు పైన విస్తర పెట్టి దానిపైన శనగలు పూజించే వారి దోసెలతో నాలుగు దోసెల్లో గుట్టగా పోసి దాని పైన ప్రమిద అమర్చి అందులో మూడు లేదా 16 సన్నటి వత్తులు చేత ఆవు నేతితో దీపారాధన చేసి గణేశుని నమస్కరించి గురువును ధ్యానించి పై చెప్పబడిన గురుస్తోత్రాన్ని భక్తిశ్రద్ధలతో 108 సార్లు రెండు పూటలా వజ్రాసనంలో జపించాలి ఇలా 41 రోజుల తర్వాత ఈ దీపమును ఉత్తరం పారే నీళ్లలో నిమర్జిం చాలి మరియు ప్రతి గురువారం శనగలు తీసి వేరే శనగలు పోసి తీసివేసిన శనగలు ఉడకబెట్టి గుడిలో ప్రసాదముల పంచాలి. దీనివలన గురు గ్రహణగ్రహం తప్పకుండా కలిగి ధన పుత్ర రాజయోగాలు యందు ఎంతో అభివృద్ధి కనబడుతుంది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top