Edit Content
Click on the Edit Content button to edit/add the content.

22/12/25 రవి మకర రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం ముగుస్తుంది

Pడిసెంబర్ 22 పుష్య మాస సోమవారం శుక్లపక్ష ద్వితీయ ఉదయం 9:30 వరకు తదుపరి తదియ ఉత్తరాషాఢ నక్షత్రం తెల్లవారుజామున 4:39 వరకు తదుపరి శ్రవణా నక్షత్రం దుర్ముహూర్తం పగలు 12:20 నుండి 1:04 నిమిషాల మధ్య కలదు. సోమవారం ఉత్తరాషాడ నక్షత్రం మృత్యోగ హాని శ్రవణ సిద్ధయోగం కార్యసిద్ధి కనక తెల్లవారుజామున 4:40 తర్వాత ప్రయాణాలు అనుకూలం సూర్య భగవానుడు సంవత్సరములో ఒకసారి ధనురాశిలో ఇంకోసారి మీనరాశిలో ప్రవేశిస్తాడు ఈ రెండు రాశులకు అధిపతి గురుడు కాబట్టి ఈ సమయంలో సూర్యుడు గురు గ్రహ ప్రభావంతో విశ్రాంతి తీసుకుంటాడని జ్యోతిష్శాస్త్రం చెబుతుంది ఈ మాసంలలో శుభకార్యాలు చేయకూడదు ఆధ్యాత్మిక సాధనలు దానధర్మాలకు ఈ కాలం ఎంతో అనుకూలమైనది గ్రహదోషాలని తగ్గించి దైవ ఆశీస్సులు పొందడానికి ఈ సమయం ఉత్తమమని జ్యోతిష్శాస్త్రం చెబుతుంది ముఖ్యంగా సూర్యదేవుడు బృహస్పతి అనుగ్రహం కోసం చేసే పూజలు విశేష ఫలితాలు ఇస్తాయి రవి మకర రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం ముగుస్తుంది అప్పటినుండి శుభకార్యాలకు అనుకూలము ధనుర్మాస సమయంలో కొన్ని ప్రధాన శుభకార్యాలు ప్రారంభోత్సవాలకు దూరంగా ఉండాలి వీటిలో వివాహాలు నిశ్చితార్ధాలు పిల్లల నామకరణం ఉపనయనం పంటి సంస్కారాలకు కూడా చేపట్టడం మంచిది కాదు కొత్త ఇల్లు కట్టుకోవడం లేదా గృహప్రవేశం చేయడం కొత్త వ్యాపారాలు లేదా భాగస్వామ్యాన్ని ప్రారంభించడం ఆస్తి కొనుగోలు వాహనాలు కొనడం లేదా పెద్దపెద్ద పెట్టుబడులు పెట్టడం వంటివి కూడా ఈ కాలంలో చేయరాదు ఇలా చేస్తే ఆలస్యాలు ఆటంకాలు లేదా ప్రతికూల ఫలితాలు కలుగుతాయి భౌతిక కార్యకలాపాలకు పరిమితులు ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక వృద్ధికి దోష నివారణలకు ధనుర్మాసం చాలా ప్రయోజకరమైన మాసం ప్రతిరోజు ఉదయం రాగి పాత్రలో నీరు కుంకుమ ఎర్రటి పూలు బియ్యము కలిపి సూర్యదేవునికి అర్ఝం ఇవ్వడం శ్రేష్టం అలాగే మంత్ర పఠణం ధ్యానం తపస్సు దానధర్మాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. వీలైతే గంగా నదిలో లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేయడం మంచిది. ఆవులు బ్రాహ్మణులు పేదల సేవలో పాల్గొనడం శ్రేష్టం ఈ కాలంలో కనీసం ఒక్కసారైనా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం ద్వారా గ్రహదోషాలు తొలగిపోతాయి దైవాశిష్యులు లభిస్తాయని గురువచనము వృశ్చిక రాశి వారు బ్యాంకు సంబంధించిన లావాదేవీలకు శుభకాలము చిట్స్ ఫైనాన్స్ లాంటి ఉద్యోగ వ్యాపారస్తులు వెంకటేశ్వర స్వామి దర్శనం వలన ఉద్యోగంలో ప్రమోషన్లు చేస్తున్న వ్యాపారాలలో అభివృద్ధి కనపడుతుంది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top