Edit Content
Click on the Edit Content button to edit/add the content.

19/12/25 దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా మొండిగా పెంకిగా బద్ధకంగ

డిసెంబర్ 19 మార్గశిర మాస శుక్రవారం కృష్ణపక్ష అమావాస్య ఉదయం 6:20 వరకు తదుపరి భాడ్యమి జేష్ట నక్షత్రం రాత్రి 10:50 వరకు తదుపరి మూలా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:39నుండి 9:23 మధ్య కలదు శుక్రవారం జేష్ఠా నక్షత్రం ద్వజయొగం దుర్వార్త శ్రవణము మూల స్థిర యోగం కార్యసిద్ధి కనక రాత్రి 10:50 తర్వాత ప్రయాణాలు అనుకూలం మాస శివరాత్రి పర్వదినము నందు శివ ఆలయంలో పూజలు శివ దర్శనం ప్రదక్షిణలు చేయడం చెరుకు రసం అని అభిషేకం ఉపయోగించి భక్తులకు పంచిన వృత్తి లో ఇబ్బందులు ఎదుర్కునే వారికి ఆటంకాలు నుండి ఉపశమనం లభిస్తుంది. శివున్ని మారేడు దళాలతో లేదా కనీసం గంగాజలముతోనైనా అభిషేకాదులు అర్చనలు చేయడం మంచిది. లేదా ఉపవాసం ఉండి కనీసం మూడు సార్లు స్నానం చేసి మంచం మీద పడుకోకుండా పరమశివుని నిత్యం ధ్యానిస్తే జాతక చక్రంలో క్షీణ చంద్ర దోషములు యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుంది సంతానలేమి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. వృత్తి అంశాలలో ఆలస్యాలు అవరోధాలు మార్పులు కనబడతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా మొండిగా పెంకిగా బద్ధకంగా మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల చేత వారి తల్లిదండ్రులు ఈరోజు ఉపవాసం చేయించి దేవాలయమునకు పెళ్లే అలవాటు చేసుకోగలిగితే వారిలో కాలక్రమంగా కచ్చితంగా మార్పులు వస్తుంది మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది కనుక మాస శివరాత్రిని శాస్త్రీయంగా జరుపుకోవడం మంచిదని గురువచనము గోచారంలో ధనుర్ రాశి లో రవి కుజ తో పాటు సంచారం కనుక మిధున రాశి వారు శ్రీరామచంద్రుని మందిరానికి సంబంధించిన సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం లేదా రాములవారికి ప్రత్యేక పూజలు చేయించడం రామ దర్శనం సుందరకాండ పారాయణం శుభ ఫలితాలు కలగజేస్తుంది మరియు వ్యాపారాలలో అభివృద్ధి కనపడుతుంది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top