డిసెంబర్ 11 మార్గశిర మాస గురువారం కృష్ణపక్ష సప్తమి సాయంత్రం 6:44 వరకు తదుపరి అష్టమే మకా నక్షత్రం ఉదయం 8:05 వరకు తదుపరిపుబ్బా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 10 03 నుండి 10 47 మధ్య గలదు గురువారం మఖా నక్షత్రం ముసల యోగం భోజనహాని పూర్వ పల్గోని గదా యోగంశుభము కనుక ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది ప్రార్థన అనేది దేవుని నిర్ణయాన్ని మార్చలేదు కానీ మన మనస్సుని ప్రభావితం చేసి శాంతిని చేకూరుస్తుంది.
కోరికలతో చేసే ప్రార్థనలు దైవమును కదిలించలేవు. అవి వృథాగా పోవాల్సిందే! కానీ దిక్కుతోచని, అతి క్లిష్ట పరిస్థితుల్లో హృదయాంతరాళం నుండి పొంగిపొరలి వచ్చే ప్రార్థనలు వెనువెంటనే దేవుని చేరతాయి.
ఫలితాలు కూడా వెనువెంటనే అనుగ్రహించబడవచ్చు కూడా. అయితే కొన్నిసార్లు ఫలితాలు సమయ సందర్భాలకు అనుగుణముగా ఇవ్వడం జరుగవచ్చు. అది కూడా మన మంచికే తప్ప చెడు ఏమీ ఉండదు.
ఏది ఏమైనా సరే ప్రార్థనను మన జీవితంలో ఒక భాగం చేసుకోవడం చాలా ముఖ్యం. దీని వలన ఇహలోక శాంతులే కాక పరలోక శాంతులు కూడా సొంతమవుతాయ నీ గురువచనము ఈరోజు త్రిసోష్టక పర్వదినం కనుక గతించిన ఆత్మీయులకి తల్లిదండ్రులకి స్నేహితులకి దక్షిణం వైపు తిరిగి తర్పణాధి కార్యక్రమాలు చేయడం వలన పితృదేవతల యొక్క ఆత్మ శాంతిస్తుంది మరియు పితృ దోషాలు ఏమైనా ఉంటే తప్పకుండా తొలగి శుభం కలుగుతుంది