డిసెంబర్ 8 మార్గశిర మాస సోమవారం కృష్ణపక్ష చవితి రాత్రి 9:20 వరకు తదుపరి పంచమి పునర్వాసు నక్షత్రం ఉదయం 9:25 వరకు తదుపరి పుష్యమి నక్షత్రం దుర్ముహూర్తం పగలు 12:13 నుండి 1గం మధ్య కలదు సంకష్టహర చతుర్థి పర్వదినం సోమవారం పునర్వాసు నక్షత్రం ధూమ్రయోగం హాని పుష్యమి దాత్రృయోగం కార్యసిద్ది కనక ఉదయం 9:30 తర్వాత ప్రయాణాలు అనుకూలం సంకష్టర చతుర్ధి పర్వదినం నాడు వినాయక స్వామికి గరిక సమర్పించి గణేశ భుజంగ స్తోత్రం చదువుతూ కానీ వింటూ కానీ 108ప్రదక్షిణాలు చేసి అరటిపండు నివేదించిన అనుకున్న కార్యక్రమాలలో ఎలాంటి విజ్ఞాలు ఉన్నా కచ్చితంగా తొలగిపోతాయి చేస్తున్న పనులయందు ఆటంకాలు ఏమైనా ఉంటే తొలగి విజయం చేకూరుతుంది భార్యాభర్తల మధ్య కీచులాట తగ్గుతుంది వాస్తు దోషాలు కు పరిష్కారం లభిస్తుంది గృహ సంబంధించిన గృహబలం తప్పకుండా పెరుగుతుంది పవిత్రమైన చతుర్ధి రోజు పేదలకు బియ్యం గోధుమలు పప్పులు వంటివి ధాన్యాలను దానం చేయవచ్చు అలాగే దుస్తులు దుప్పట్లు పండ్లు స్వీట్స్ నెయ్యి వంటివి కూడా దానం చేయడం శుభప్రదం. అయితే దానం చేసే సమయంలో మనస్సులో ఎలాంటి స్వార్థం ఉండకూడదు దానం చేసే సమయంలో ఎవరిని అవమానించకూడదు దానధర్మాలు రహస్యంగా ఉంచాలని గురవచనము గోచారంలో కుజ గ్రహము ధనుర్ రాశిలోకి సంక్రమణము కుజగురువులు సమసప్తక దృష్టితో సంచారం వలన విద్య వైద్యం సంబంధించిన ధనుర్ మిధున రాశి ఉద్యోగస్తులు మరియు వ్యాపారస్తులకు శుభ కాలము వీరు వ్యాపార విస్తరణలు శుభ ఫలితాలు కలగజేస్తుంది వ్యాపారంలో గల చిక్కులేమన్నా ఉంటే తప్పకుండా వీడిపోతాయి సుబ్రమణ్య స్వామి వారి ఆరాధన గురు దర్శనం మరింత శుభం చేకూరుతుంది