డిసెంబర్ 7 మార్గశిర మాస ఆదివారం కృష్ణపక్ష తదియ రాత్రి 10:58 నిమిషాల వరకు తదుపరి చవితి ఆరుద్ర నక్షత్రం ఉదయం 10:34 వరకు తదుపరి పునర్వాసు నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 3:53నుండి 4:37 మధ్యగలదు ఆదివారం ఆరుద్ర నక్షత్రం ద్వాంక్షయోగం విజ్ఞము పునర్వసు ధ్వజయోగం రాజ్య లాభం కనుక ఉదయం 10:40 తర్వాత ప్రయాణాలు అనుకూలం మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం రోజున శివలింగాన్ని పూజించిన వారు శివునికి, కుమారస్వామి కంటే ఎక్కువ ఇష్టుడవుతారు సూర్యదయానికి ముందే శివాభిషేకం శివ దర్శనం శివ పూజ అత్యంత పుణ్యపదం ఆరుద్ర నక్షత్రంలో శివుడు స్తంభాకారం ధరించి మాఘమాస కృష్ణ చతుర్థశి అంటే శివరాత్రి నాటికీ అగ్నిస్తంభ రూపానికి వచ్చాడు అందుకే ఈ మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం మరియు మాఘమాస కృష్ణపక్ష చతుర్థశి శివరాత్రి శివునికి అత్యంత ప్రీతికరమని శ్రీ శివపురాణం చెబుతుందని గురువచనము అయితే సౌరమాల ప్రకారం ధనుర్మాసములో వచ్చే ఆరుద్ర నక్షత్రానికి ఆరుద్రోత్సవం పాటించడం ఆచారంగా ఉన్నది ఇది జనవరి 3 2026వ తేదీ వస్తుంది జ్యోతి శాస్త్ర ప్రకారం శనివారం ద్వాదశి సోమవారం ఏకాదశి గురువారం షష్టి బుధవారం తదియ శుక్రవారం అష్టమి ఆదివారం నవమి మంగళవారం పంచమి. ఈ తిధులు కలిసిన ఈ వారాల్లో ఎలాంటి శుభకార్యాలు చేయరాదు ఇవి దగ్ద యోగాలు లంటాము గోచారంలో వృశ్చిక రాశిలో రవి కుజ బుద శుక్ర గ్రహాల సంచారము కనక వృశ్చిక రాశి వారు వృషభ రాశి వారు గ్రామ దేవత ఆలయములో ప్రత్యేక పూజలు చేయించడం లేదా ఇలవేల్పు లను దర్శించుకుని వారిని ఆరాధించడం వలన వీరి పైన గల రవి కుజ బుద్ధ శుక్ర గ్రహాల యొక్క ప్రభావము అనుకూలించి శుభం కలుగును