Edit Content
Click on the Edit Content button to edit/add the content.

06/12/25 ఆరుద్ర నక్షత్రం రోజు పూజలు వ్రతాలు అభిషేకాలు

డిసెంబర్ 6 మార్గశిర మాస శనివారం కృష్ణపక్ష ద్వితీయ రాత్రి 12:54 వరకు తదుపరి తదియ మృగశిరా నక్షత్రం పగలు 12 గం వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 6:19 నుండి 7:48 మధ్యగలదు శనివారం మృగశిర నక్షత్రం వజ్రయోగం కలహము ఆరుద్ర ముద్గర యోగ మరణం గనక ప్రయాణాలు అనుకూలంగా లేవు మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు శివుడిని దర్శించుకోవడం శివ పూజ చేయడం అభిషేకాలు చేయడం శివాలయంలో ప్రదక్షిణాలు చేయడం ఆలయంలో సేవలు చేయడం పరమశివుని పంచాక్షరి మహామంత్రాలతో ధ్యానించడం వలన శివలోక ప్రాప్తి కలుగుతుంది ఆ పరమ శివుడు అనంత ఫలితాలను ప్రసాదిస్తాడు పరమశివునికి కుమారస్వామి అంటే అత్యంతమైన ప్రీతి అయితే మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం కలిసిన రోజు అర్ధనారీశ్వరి ప్రతిమను పూజించిన వారు కుమారస్వామి కన్నా ప్రీతిపాత్రులవుతారని శివపురాణం చెబుతోంది ఆరుద్ర నక్షత్రం రోజు పూజలు వ్రతాలు అభిషేకాలు నోములు హోమాలు చేయలేని వారు కేవలం శివ దర్శనం చేసుకున్నంత మాత్రాన అనంత ఫలితం పొందుతారు అంటే వాక్కుకు దొరకనంత దృష్టి చూడలేనంత ఫలితం వస్తుంది అమ్మవారు పార్వతీదేవి మృగశిరా నక్షత్రం నందు జన్మించినందున మృగశిర్ష నాలుగో పాదం ఆరుద్ర ఒకటో పాదం ఈ సంధి కాలము నందు శివదర్శనం అభిషేకం ప్రదక్షిణలు అత్యధిక శుభాలు కలుగజేస్తాయి కనీసం సంధ్యా సమయం ప్రదోషకాలంలో శివ దర్శనం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు పొందుతారని గురువచనము తులా రాశిలో బుధసంచారము వీరిని గురువు చంద్రుడితోపాటు చూడడం వలన తులా మేషరాశి వారికి శుభకాలము వీరు బ్యాంకు ఫైనాన్స్ సెక్టార్ సంబంధించిన వాటిలో లావాదేవీలు మంచి ఫలితాలు కలగజేస్తాయి ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి పరిష్కరింపబడతాయి వీరు వెంకటేశ్వర స్వామి దర్శనం మరింత అనుకూలమైన ఫలితాలుచూస్తారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top