నవంబర్ 26 మార్గశీర మాస బుధవారం శుక్లపక్ష షష్ఠి రాత్రి 7:14 వరకు తదుపరి సప్తమి శ్రవణా నక్షత్రం రాత్రి 9:56 వరకు తదుపరి ధనిష్ట నక్షత్రం దుర్ముహూర్తం పగలు 11:24 నుండి 12:09 మధ్య గలదు సుబ్రహ్మణ్య షష్టి కావడి మహోత్సవ పర్వదినం బుధవారం శ్రవణా నక్షత్రం చత్ర యోగం రాజ్య లాభం ధనిష్ట మిత్రయోగం కార్యసిద్ది కనక ప్రయాణాలు అనుకూలం హేమంత ఋతువులో మెుదటి మాసం అయిన మార్గశీర్షంలో నందవ్రజమైన బృందావనంలోని కుమారీమణులు, నేతితో తయారుచేసిన దైవప్రసాదం ఆహారంగా స్వీకరిస్తూ, కృష్ణుడు తమ భర్త కావాలని కాత్యాయనీ వ్రతం చేసారు. ఈ వ్రతం చేసిన వారికి అభీష్టాలు నెరవేరతాయని శ్రీకృష్ణుడు గోపికలతో స్వయంగా చెప్పాడు. ఇంతటి మహావ్రతాన్ని మార్గశీర్షం మనకు అందించింది. గోపికలు ఈ వ్రతం చేసి శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందారని గురువచనం . ఒకప్పుడు తారకుడు అనే రాక్షసుడు రుద్ర వీర్యసముద్భవుడైనటువంటి కుమారుడు చేతిలో మరణం పొందేలా బ్రహ్మ దగ్గర వరం పొందినాడు వీరిని సంహరించడానికి రుద్రవీర్యాన్ని దేవతలు గంగానదిలో ప్రవేశపెట్టగా కుమారస్వామి గంగా నది లోగల రెళ్ళు గడ్డిలో ఉద్భవించినాడు కనుక శరవణ భవుడయ్యాడు కుమారస్వామికి అరుంధతి తప్ప సప్త ఋషుల భార్యలు ఆరు మంది పాలిచ్చి పెంచడం వలన షణ్ముఖుడయ్యాడు ఈ 6 మంది ఋషుల భార్యలను కృత్తికలు అంటారు కనుక కార్తికేయడయ్యాడు ఈయన సంభవించిన తిధి మార్గశిర మాస శుక్లపక్ష షష్టి. సత్సంతానం కోసం కుమార సంభవం కథ వినినా చదివిన లేదా వళ్లీ దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి వారి నీ తెల్లని పూల చేత పూజించి సుబ్రమణ్య కరావలంబ స్తోత్రాలు అష్టకాలు తో మనసారా పూజించి నువ్వులపప్పు బెల్లం దంచినది చిమిలిని నివేదించి ప్రసాదంలా సేకరిస్తే జాతక చక్రంలో గల కుజ దోషము పూర్తిగా నివారించబడి ఆలస్యమవుతున్న వివాహాలుకి త్వరగా అనుకూలమైన సంబంధాలకుదురుతాయి అంతేకాకుండా పుత్ర సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి తప్పకుండా పుత్ర భాగ్యం కలుగుతుంది