నవంబర్ 25 మార్గశిర మాస మంగళవారం శుక్లపక్ష పంచమి ఉదయం సాయంత్రం 6:50 వరకు తదుపరి షష్టి ఉత్తరాషాడ నక్షత్రం రాత్రి 9 గంటల వరకు తదుపరి శ్రవణా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 86 నుండి 9 10 మధ్య కలదు మంగళవారం ఉత్తరాషాడ నక్షత్రం మానస యోగం శ్రీ సంతోషం శ్రవణ లంబయోగం కార్య హానిక రాత్రి 9 లోపు ప్రయాణాలు అనుకూలం మార్గశిరమాసమంతా ఏకభుక్తం చేస్తే అనగా ఒకపూట భోజనం మాత్రమే చేసి, శివకేశవనామాలు జపిస్తూ, యథాశక్తి అన్నదానం చేసేవారు, రోగాలనుండి విముక్తులౌతారనీ, సకలశుభాలు కలుగుతాయనీ, రైతులకు ఈ వ్రతం వల్ల పంటలు బాగా పండడం వల్ల ధాన్యం సమృద్ధిగా లభిస్తుందనీ, సంపదలు అభివృద్ధి చెందుతాయనీ మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో 106 వ అధ్యాయంలో అంగీరస మహర్షి చెప్పినట్లుగా భీష్ముడు ధర్మరాజుకు వివరిస్తాడు. మార్గశిరంలో వేదాధ్యయనం, ఉపనిషత్ పారాయణలు చేస్తే బ్రహ్మ లోకం ప్రాప్తిస్తుందని శివపురాణం చెపుతున్నది. ఆర్ద్రానక్షత్రం ఉన్న రోజున శివుని పూజించిన మానవులకు ఈ లోకంలో భోగాలు లభిస్తాయి. శరీరం విడిచిపెట్టాక శివసన్నిధి పొందుతారు. మార్గశీర్షంలో అన్నదానం చేసేవాడు, కోరిన కోరికలు తీర్చుకోగలుగుతాడు. ఈ లోకంలో సకలభోగాలూ పొందుతాడు. శరీరం విడిచిపెట్టాక శివునిలో కలిసి పోతాడు. వేదాంతజ్ఞానం లభిస్తుంది. తెల్లవారుజామున శివుని పూజించేవాడు, కుబేరునితో సమానమైన సంపదలను పొందుతాడు, అనగా సంపదలవలన సుఖం, సంతృప్తి పొందుతాడు. మార్గశిరంలో చేసే గోదానం, భూదానం అనంత ఫలితాలనిస్తాయి. అంగీరసుడు మార్గశీర్షమాసం జ్ఞానమాసం అని పేర్కొన్నాడు. ఈ మాస మహిమను గుర్తించినవాడు వార్ధక్యంలో సుఖజీవనం గడుపుతారని గురువచనం