నవంబర్ 16 కార్తీక మాస ఆదివారం కృష్ణపక్ష ద్వాదశి తెల్లవారుజామున 5 10 వరకు తదుపరి త్రయోదశి హస్తా నక్షత్రం తెల్లవారుజామున 3 వరకు తదుపరి చిత్తా నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 3: 50 నుండి 4:36 మధ్యగలదు రవి వృశ్చిక రాశిలోకి ప్రవేశం రాత్రి 2:20 తర్వాత ఆదివారం హస్తా నక్షత్రం మానస యోగం శ్రీ సంతోషం చిత్త పద్మయోగం ఐశ్వర్యం కనక ప్రయాణాలు అనుకూలం కార్తీక మాస కృష్ణపక్ష ద్వాదశి రోజు అతి భక్తిశ్రద్ధలతో గురుద్యానం చేసుకుంటూ కార్తీక స్నానం చేసే వారికి పూర్వ జన్మలో చేసిన తల్లిదండ్రుల పైన నిందలు గురు ద్రోహాల వలన ఈ జన్మలో శ్వాస కోసం కంట ఉదర సంబంధించిన వ్యాధి చేత బాధపడుతున్న వారి కర్మలు పాపాలు తొలుగుతాయి ఈరోజు చేసే దానంలో కూరలు కంద దుంప ఉండేలా చూసుకోవాలి చిత్రలేఖ అనే విద్యాధర కన్య యొక్క అనుగ్రహం పొందాలంటే ఆకుకూరలు దుంపలు ఈరోజు దేవాలయాలలో అర్హత కల పండితోత్తములకు దానం చేయడం తో అనుగ్రహం కలిగి వంశాభివృద్ధి కలుగుతుంది ఇంట్లో తెలియక ఆత్మహత్యలు చేసుకున్న వారి ఆత్మ శాంతి పొందాలన్నా ఈరోజు ఉదయం కార్తీక స్నానం చేసి విభూది ధారన చేసి శివ దర్శనం మరియు ఆలయాల్లో దీపారాధనలతో ఆత్మ శాంతిస్తుంది గురునిందా దోషం కూడా ఈరోజు విభూది ధారణ చేసి చేసే పూజల్లో మరియు దేవాలయాల్లో దీపారాధనలతో తొలగుతుంది అంబరీషోపాఖ్యానం మరియు విష్ణు భగవానుని యొక్క దశావతారాలు పొందిన కథను వినిన చదివిన కార్తీక మాస మెత్తం నత్త ఉపవాసము చేసి పొందే శుభ ఫలితాలు పొందుతారని గురువచనము ముఖ్యంగా ఆలయ దర్శనాలు అభిషేకాలు ప్రదక్షిణలు దీపారాధన ఆలయ సేవ గో సేవ మరియు నవగ్రహాల ప్రదక్షిణలు ఇలాంటివి శాస్త్ర సమ్మతమైన క్రియలు ఇవి లేదన్న ఇవి చేస్తే లాభం లేదన్న వారు మాటలు నమ్మకుండా మీకు నచ్చిన సేవలు ఎంచుకొని చేసి ఆ పరమశివుని యొక్క అనుగ్రహం పొందగలరు