నవంబర్ 8 కార్తీక మాస శనివారం కృష్ణపక్ష తదియ పగలు 12:08 నిమిషాల వరకు తదుపరి చవితి మృగశిరా నక్షత్రం తెల్లవారుజామున 3:50 వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 6:03 నుండి 7:35 మధ్యగలదు సంకష్ట చతుర్థి పర్వదినం శనివారం మృగశిర నక్షత్రం వజ్రయోగం కలహము ఆరుద్ర ముద్గరయోగం మరణం గనక ప్రయాణాలు అనుకూలంగా లేవు కార్తీక మాస కృష్ణపక్ష తదియ రోజు లక్ష్మీనారాయణ స్వామిని పూజించాలి దగ్గర్లో ఉన్న రామాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ నారాయణస్వామి దర్శించి ప్రదక్షిణలు చేసి దీపావళి వెలిగించి విష్ణు సహస్రనామ పారాయణం కానీ పురుష సూక్తాలతో గాని భక్తిశ్రద్ధలతో అరాదించాలి మరియు శివాలయంలో బిలవృక్షం దగ్గర గాని లేదా మారేడు ఉసిరిక చెట్టు దగ్గర గాని ఆవు నీతితో దీపాలు వెలిగించాలి ఈ రోజు రాత్రి 8 గంటల లోపు చేసే అన్నదానం వలన జీవితంలో అన్న వస్త్రాలకు లోటుండదు స్వయంపాకం దానం అందులో పెసరపప్పు మినప్పప్పు ఉండేలా చూసుకుని చేయాలి పశుపక్షాదులకు ఈరోజు అన్నం పెట్టడం వలన చర్మ సంబంధించిన వ్యాధుల నుండి బయటపడతాము మరుయు పండితోత్తములకి బియ్యం దానం చేయాలని గురువచనం సంకష్టహర చతుర్థి పర్వదినం నాడు వినాయక స్వామిని గరికతో భుజంగ స్తోత్రాలు పంచరత్నమాల స్తోత్రాలతో ఆరాధించడం దేవాలయంలో ప్రదక్షిణలు చేయడం వలన ఉద్యోగ ప్రాప్తి భార్యాభర్తల మధ్య కలహాలు తొలుగుతాయి విదేశీయానం కోరుకున్న వారు నేటి మొదలు 41 రోజు ప్రతినిత్యము 108 ప్రదక్షణ చొప్పున గణేశ భుజంగ స్తోత్రం పటిస్తూ ప్రదక్షిణలు చేయాలి