Edit Content
Click on the Edit Content button to edit/add the content.

07/11/25 పంచాంగం

నవంబర్ 7 కార్తీక మాస శుక్రవారం కృష్ణపక్ష విదియ పగలు 2:30 వరకు తదుపరి తదియ కృత్తికా నక్షత్రం ఉదయం 7:00 వరకు తదుపరి రోహిణి నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:00నుండి 9:05 మధ్య కలదు శుక్రవారం కృత్తికా నక్షత్రం చత్ర యోగం రాజ్య లాభం రోహిణి మిత్రయోగం కార్యసిద్ధి గనుక ప్రయాణాలు అనుకూలం కార్తీక మాస కృష్ణపక్ష విదియ రోజు మందారపు పూలు అవిశ పూలతో ఆ పరమశివుని అష్టోత్తర శతనామాలతో గానీ లేదా మహావిష్ణువుని పురుష సూక్తాలతో గాని ఆరాధించాలి గుడిలో ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఎంత నిశ్శబ్దంతో చేస్తామో అంత ఫలం పొందుతాము గురోపదేశం చేసిన మహామంత్రాన్ని ఉపాసిస్తూ ప్రదక్షిణ చేస్తే అతి శీఘ్రంగా ఫలాలు పొందుతారు అది భూప్రదక్షిణతో సమానం అవుతుంది యధాశక్తిగా వీలై నన్ని దీపాలు ఆలయంలో కానీ తులసి కోట లేదా ఉసిరిక చెట్టు దగ్గర బిల్వ వృక్షం దగ్గర గాని నేతి దీపాలు వెలిగించడం లక్ష్మీకరం గోపూజ చేయడం వీలైనంతవరకు తత్వ విశేషాలు తెలుసుకోవడం ముఖ్యంగా లోభగుణాన్ని విడిచి వీలైనంతవరకు దానధర్మాలు చేయడం వలన శివ కటాక్షం లభిస్తుంది  శివుని పూజించి విష్ణువు దేశించడం విష్ణువుని పూజించి శివుని ద్వేషించడం చెయ్యరాదు శివుడే విష్ణువు విష్ణువే శివుడు ముఖ్యంగా కార్తీక మాసంలో దీపారాధన దేవాలయంలో ప్రదక్షిణలు విష్ణు కవచం నారాయణ సరస్వతీ కవచం లాంటి కవచాలు వినడం పారాయణం చేయడం వలన ముక్తి పొందుతారని గురువచనం మేష తులా రాశి వారు సాయంత్ర సంద్యయందు అత్యవృక్ష క్రింద దీపారాధన చేసి భక్తిశ్రద్ధలతో మహాలక్ష్మి అష్టకాన్ని చదువుతూ కానీ వింటూ గానీ 108 ప్రదక్షిణలు చేసి బెల్లం నివేదించిన శుభకార్యము కలుగును

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top