Edit Content
Click on the Edit Content button to edit/add the content.

05/11/25 వీలైనంతవరకు పరనింద చేయడం

నవంబర్ 5 కార్తీక మాస బుధవారం శుక్లపక్ష పౌర్ణమి రాత్రి 7 12 వరకు తదుపరి బహుళ పాడ్యమి అశ్విని నక్షత్రం ఉదయం 10 15 వరకు తదుపరి భరణి నక్షత్రం దుర్ముహూర్తం పగలు 11:21 నుండి 12 :07 మధ్యగలదు జ్వాలా తోరణం కార్తీక పౌర్ణమి పర్వదినం బుధవారం అశ్విని నక్షత్రం మృత్యుయోగం హాని భరణి కాలయోగం కార్యహాని కనుక ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది కార్తీక పౌర్ణమి రోజు గోలోకంలో కృష్ణ భగవానుడు రాధా సమేతముగా గోపికలతో పాల సరోవరంలో జలక్రీడలాడుతారు అదే సమయంలో బృందావనములో కాళిందిలో కృష్ణ భగవానుడు రాధా సమేతముగా జలక్రీడలాడుతారు కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు యమునా నదిలో స్నానం చేయడం దైవానుభూతి పొందుతాము కార్తీక పౌర్ణమి రోజు శివ కేశవుల ఆలయంలో 101 ప్రదక్షణ చేయడం వలన సర్వపాపాలు నశించిపోతాయి భక్తిశ్రద్ధలతో ఆవు నేతితో వీలైనన్ని దీపాలు వెలిగించడం ధ్వజస్తంభం దగ్గర అష్టదళ పద్మం ముగ్గు వేసి రావి ఆకు పైన దీపాలు పెట్టడం ఉసిరి చెట్టు కింద తమలపాకు పెట్టి దీపాలు పెట్టడం అవకాశముంటే నక్తం ఉపవాసం ఉండడం శక్తి కొలది దానం చేయడం ఉల్లిపాయ వెల్లిపాయ తప్ప తినడానికి ఉపయోగపడే కూరగాయలు పాలు పెరుగు నెయ్యి లేదా వస్త్రాలు దానం చేయడం భాగవత కథలు వినడం వలన ఈశ్వర అనుగ్రహం పొందుతాము వీలైనంతవరకు పరనింద చేయడం మంచిది కాదు ఎంత పవిత్రంగా కార్తీక మాస గడుపుతామో అంత సుఖవంతమైన జీవితాన్ని పొందుతామని గురువచనం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top