Edit Content
Click on the Edit Content button to edit/add the content.

29/10/25 పంచాంగం

అక్టోబర్ 29 కార్తీక మాస బుధవారం శుక్లపక్ష అష్టమి తెల్లవారుజామున 4 26 వరకు తదుపరి నమమే ఉత్తరాషాడ నక్షత్రం పగలు1:30 నిమిషాల వరకు తదుపరి శ్రవణా నక్షత్రం దుర్ముహూర్తం పగలు 11:20 నుండి 12:06 మధ్య కలదు కార్తవీర్యా జయంతి పర్వదినం బుధవారం ఉత్తరాషాడ నక్షత్రం వజ్రయోగం కలహం శ్రవణ చత్రయోగం రాజ్య లాభం కనుక పగలు 1 30 తర్వాత ప్రయాణాలు అనుకూలం న కార్తిక సమో మాసః
మాసాలలో కార్తిక మాసానికి సమానం అయిన మాసం లేదని శాస్త్రం. పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటే ఆ మాసానికి ఆ పేరు వస్తుంది. కృత్తికా నక్షత్రం పూర్ణిమ నాడు ఉండటం వల్ల ఈ మాసానికి కార్తికమాసం అని పేరు వచ్చింది.
కార్తికమాసం శివకేశవులిద్దరి సమష్టి రూపం. అందుకే ఈ మాసం అత్యంత పవిత్రమైనదని పద్మపురాణంలోని ఉత్తరఖండంలో వేదవ్యాసులవారు వివరించారు. ఈ మాసంలో స్నానం, దానం , జపములు, దీపం ప్రదక్షిణలు,అన్నదానం చేయడం కోటి యజ్ఞములతో సమానం.సూర్యోదయానికి ముందే సంకల్ప సహిత స్నానం చేయాలి.మాంసాహారం నిషిద్ధం, స్వయంపాకం దానంగా ఇవ్వాలి. దీపదానం చేయటం మరింత ఉత్తమ మని గురువచనము కోల్పోయిన ఆస్తులు డబ్బు సంపద తిరిగి రావడానికి అఖండ ధన ప్రాప్తి కొరకు కార్తవీర్యార్జునుని కథ వినడము లేదా కార్తవీర్యార్జును మంత్రం పఠించడం చేస్తే తప్పకుండా తిరిగి పొందుతారు గోచారంలో శుక్రుడు నీచ స్థానం సంచారం కనుక శుక్ర మహర్దశ జరుగుతున్న వారు భరణి పుబ్బ పూర్వాషాడలను నక్షత్రం నందు జన్మించిన వారు లక్ష్మీదేవి అమ్మవారిని బిల్వపత్రాలతో అష్టకాలతో స్తోత్రాలతో శతనామాలతో పూజించడం వలన దశావ నాథుడు యొక్క బలం పెరిగి శుభ ఫలితాలు పొందుతారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top