అక్టోబర్ 28 కార్తీక మాస మంగళవారం శుక్లపక్షసప్తమి తెల్లవారుజామున 4 గంటల వరకు తదుపరి అష్టమి పూర్వాషాఢ నక్షత్రం పగలు 12 నిమిషాల వరకు తదుపరి ఉత్తరాషాడ నక్షత్రం ఉదయం 8:15 నుండి 93 మధ్య కలదు మంగళవారం పూర్వాషాడ మిత్రయోగం కార్యసిద్ధి ఉత్తరాషాడ నక్షత్రం మానసయోగం స్త్రీ సంతోషం కనుక ప్రయాణాలు అనుకూలం మారేడుచెట్టు శివుని స్వరూపమే. శివునికీ, బిల్వవృక్షానికీ తేడా లేదు. అందుకే దేవతలు కూడా ఈ చెట్టును అతి భక్తితో స్తుతిస్తారు. ఈ చరాచర జగత్తులో ప్రసిద్ధికెక్కిన ఎన్ని పుణ్యతీర్థాలున్నాయో అవన్నీ మారేడుచెట్టు మూలంలో (వ్రేళ్ళలో) ఉంటాయి. మారేడుచెట్టు మూలంలో లింగం ఒకదానిని కాని లేదా అనేక లింగాలను కాని ఉంచి పూజించినవాడు పరమ పుణ్యాత్ముడౌతాడు. శివుని సన్నిథిని పొందగలుగుతాడు. మారేడుచెట్టు క్రింద స్నానం చేసినవాడు, సమస్త పుణ్యతీర్థాలలో స్నానం చేసిన మహాఫలం పొంది, పవిత్రుడౌతాడు. గంధపుష్పాదులతో మారేడుచెట్టు మొదలును పూజించినవాడు శివలోకంలో శాశ్వతంగా ఉండగలుగుతాడు. మారేడుచెట్టు దగ్గర దీపం వెలిగించిన పుణ్యాత్ముడు, తత్త్వజ్ఞానం పొందుతాడు. శరీరం విడిచిపెట్టాక శివుడిలో ఐక్యం అవుతాడు. అందునా, కార్తిక మాసం లోనూ, మాఘ మాసం లోనూ, ప్రతి మాసశివరాత్రికీ, మారేడు దగ్గర ఆవునేతిదీపం వెలిగించిన వాడికి ఈ జన్మలోనే కైవల్యం లభిస్తుంద నీ గురువచనము
గోచారంలో గురుని పంచమ దృష్టి వలన వృశ్చిక రాశిలో సంచరిస్తున్న కుజబుదులు శుభలైనారు వీరితోపాటు వృషభ రాశి కూడా ఫలితాలు కలగజేస్తాయి కనుక మీరు లక్ష్మీనరసింహస్వామి వారిని పూజించడం వలన విపరీత రాజయోగం కలుగును