[ ] అక్టోబర్ 16 ఆశ్వయిజమాస మాస గురువారం కృష్ణపక్ష దశమి పగలు 1:40 వరకు తదుపరి ఏకాదశి ఆశ్లేష నక్షత్రం సాయంత్రం 4:31 వరకు తదుపరి మఖా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 9:49 నుండి 10:36 మధ్యగలదు గురువారం ఆశ్లేష నక్షత్రం అమృత యోగం శ్రీ సంతోషం మఖ ముసలయుగం భోజన హానిక సాయంత్రం 4:30 లోపు ప్రయాణాలు అనుకూలం క్షేత్రాలను నదులను గురువులను మహాత్ములను నిందించరాదు ఆధ్యాత్మిక గ్రంథాలు కథలు పురాణ విశేషాలు ప్రామాణికమైన పుస్తకములు లేదా అన్ని పురాణములు తెలిసిన సద్గురువుల ద్వారా మాత్రమే తెలుసుకోవాలని శాస్త్రం దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు అమ్మవారు అనేక రూపాలు ధరించింది ఈ రూపాలలో ఉత్తమ రూపం శ్రీ లలిత పరాబట్టారిక ఈ తల్లి నాలుగు చేతులతో దర్శనమిస్తుంది. నాలుగు వేదాలు నాలుగు చేతులని ఈ నాలుగు చేతులలో ధర్మ అర్థ కామ మోక్షము అనబడే చతుర్విధ ఫలపురుషార్ధాలు ప్రసాదిస్తుందని దుష్టసంహారం చేయడానికి ఈ నాలుగు చేతులలో ఆయుధాలు ధరిస్తుందని బ్రహ్మాండ పురాణములో శ్రీ లలితాపాఖ్యానం వల్ల తెలుస్తుంది ఈ నాలుగు చేతులను భక్తితో స్మరిస్తే మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అనబడే నాలుగు సక్రమంగా పనిచేస్తాయని గురువచనము శుక్రమహర్దశ జరుగుతున్న వారు శుక్ర నక్షత్రాలైన భరణి పుబ్బ పూర్వాషాడ నక్షత్ర నందు జన్మించిన వారు శుక్రుడు నీచ పట్టి ఉండడం వలన వీరు అతి వృక్షము కింద దీపారాధన చేసి ఆరాధించిన ప్రదక్షిణాలు చేసిన శుక్ర గ్రహ బలము తోడై శుభాలు కలుగుతాయి