Edit Content
Click on the Edit Content button to edit/add the content.

20/09/25 పంచాంగం

సెప్టెంబర్ 20 భాద్రపద మాస శనివారం కృష్ణపక్ష చతుర్దశి రాత్రి 11:50 వరకు తదుపరి అమావాస్య మఖా నక్షత్రం ఉదయం 9 గంటల వరకు తదుపరి పుబ్బ నక్షత్రం
దుర్ముహూర్తం ఉదయం 5:52 నుండి 7:28 మధ్యగలదు మాస శివరాత్రి పర్వదినం శనివారం మకా నక్షత్రం పద్మయోగం ఐశ్వర్యము పుబ్బ నక్షత్రం లంబయోగం కారిహానికనక ఉదయం 9 10 లోపు ప్రయాణాలు అనుకూలం పితృపక్షాలలో  ముఖ్యంగా మహాలయ అమావాస్య నాడు  తప్పక  మన బంధువులకు, స్నేహితులకు అలా ఎవరైనా మరణించిన వారికి తర్పణాలు ఇవ్వడం వల్ల వారికి ఉత్తమగతులు వస్తాయని శాస్త్రం. పితృకార్యక్రమాలు విడిచి ముక్కు మూసుకుని వేయి సంవత్సరాలు తపస్సు చేసినా వారికి దేవతానుగ్రహం కలగదు. కానీ ఇటువంటి పర్వదినములలో ఇచ్చిన తర్పణాల వలన ఎన్నో దోషాలు తొలుగుతాయి. సాక్షాత్  శ్రీరామచంద్రుడు  కూడా పితృకార్యాలు చేసాడని రామాయణం చెబుతోంది. ఇవి చేయకపోతే పితృదేవతల అనుగ్రహం ఆ వంశానికి చెందదు దీనివలన బాల్యమరణాలు, వివాహం  ఆలస్యం అవడం, వివాహం అయినా భార్యాభర్తల మధ్య సత్సంబంధం లేకుండడం, సంతానం కలగకపోవడం లేదా పిల్లలకు సరైన ఉద్యోగం లేకపోవడం మొ||   వంటివి జరుగుతాయని గురుబోధ మాస శివరాత్రి పర్వదినమున వీలైనంత పార్దివ లింగాలు తయారుచేసి పూజించేవారు ముక్తిని పొందుతారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top