సెప్టెంబర్ 15 భాద్రపద మాస సోమవారం కృష్ణపక్ష అష్టమి ఉదయం 6:40 వరకు తదుపరి నవమి మృగశిరా నక్షత్రం ఉదయం 11:50 వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం దుర్ముహూర్తం పగలు 12 20 నుండి
1:09 నిమిషాల మధ్య గలదు వెతిపామహాలయం అనఘవ్రత పర్వదినం సోమవారం మృగశిరా నక్షత్రం ఆనందయోగం ద్రవ్య లాభం ఆరుద్ర కాలదండ యోగం విఘ్నం కనుక ఉదయం 11:50 లోపు ప్రయాణాలు అనుకూలం భూలోకంలో ఉన్న మనకు పగలు రాత్రి కలిస్తే ఒకరోజు అంటారు దేవతలకు ఉత్తరాయణం దక్షిణాన కలిపి ఒక రోజవుతుంది అంటే మనకు ఒక సంవత్సరము దేవతలకు ఒక రోజుతో సమానం అదే పితృదేవతలకు శుక్లపక్షం కృష్ణపక్షం కలిస్తే ఒకరోజు మనకు 30 రోజులు పితృదేవతలకు ఒక రోజుతో సమానం అందుకే ప్రతి నెల అమావాస్యనాడు వారికి తప్పకుండా తర్పణాలు స్వయంపాకం దానం ఇవ్వడం ఉత్తమమని గురవచనము గోచారంలో శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశం కనుక కుంభ సింహ రాశి వారు సాయంత్రం సంధ్య యందు మహాలక్ష్మి అమ్మ వారి గుడిలో ప్రదక్షణాలు చేసి ఆవు నేతితో మూడు వత్తులు చొప్పున మట్టి ప్రమిదల దీపారాధన చేసి ఆగస్త్య కృత మహాలక్ష్మి స్తోత్రాన్ని భక్తిశ్రద్ధలతో పటించిన పాయసం నివేదించి శనగ గుగ్గుల్లు పంచిపెట్టిన శుభకార్య జయం ధనయోగం ప్రాప్తించుము