ఆగస్టు 17 శ్రావణమాస ఆదివారం కృష్ణపక్ష నవమి రాత్రి 8:30 వరకు తదుపరి దశమి కృత్తికా నక్షత్రం ఉదయం 6 46 వరకు తదుపరి రోహిణి నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 4:40 నుండి 5:30 మధ్య గలదు మఖా కార్తి ప్రారంభం ఆదివారం కృత్తికా నక్షత్రం ధూమ్రయోగం హాని రోహిణి దాత్రియోగం కార్యసిద్ధి గనుక ఉదయం 7 గంటల తర్వాత ప్రయాణాలు అనుకూలం కృష్ణ భగవానుడు పూజలకు స్తోత్రాలకు భజనలకు జపాలకు కీర్తనలకు ధ్యానాలకు తపస్సులకు దానధర్మాలకు క్షేత్ర దర్శనాలకు లభ్యంకాడు తాను చెప్పినది అర్థం చేసుకున్న వాడు తాను చూపించిన మార్గంలో నడిచేవాడు ఎవరైతే కర్మ చేస్తూ కర్మ మార్గంలో ఉంటూ నిష్కామ మార్గాన్ని అవలంబించి నేను చేస్తున్నాను అన్న భావనను విడిచి పెడతారో ఎవరైతే తన మార్గంలో ఉంటూ తన హృదయాల్లో కోపం ద్వేషం అసూయ డాంబికం దర్పం ఈర్ష పగా ప్రతీకారం గర్వం అహంకారం మొదలగునవి మాలిన్యాలు లేకుండా ఉంటారో ఎవరైతే అన్నింటిలోనూ అందరిలోనూ సర్వజీవుల్లోనూ సర్వజీవజాతుల్లోనూ పశుపక్షాలలోనూ సర్వ మానవాళిలోనూ తననే చూసుకుంటారు నేను శరీరం కాదు ఆత్మ స్వరూపం అని తెలుసుకుంటారు ఎవరైతే నిరంతరం ఆనంద స్వరూపంగా ఉంటారు వారికి కృష్ణుడు లభ్యమవుతాడని గురువచనము రవి సింహం లేదు ప్రవేశించడంతో సింహ కుంభ రాశి వారు సూర్యారాధన చేయడం వలన చక్కటి ఆరోగ్యాన్ని పొందడమే కాకుండా అనుకున్న పనులు ముందుకు సాగుతాయి