ఆగస్టు 13 శ్రావణమాస బుధవారం కృష్ణపక్ష చవితి ఉదయం 8: 16 నిమిషాల వరకు తదుపరి పంచమి ఉత్తరాభాద్ర నక్షత్రం పగలు 1గం వరకు తదుపరి రేవతి నక్షత్రం దుర్ముహూర్తం పగలు 11:40 నుండి 12 30 మద్య కలదు బుధవారం ఉత్తరాభాద్ర నక్షత్రం లంబయోగం కార్యహాన్ని రేవతి ఉత్పతయోగం ద్రవ్య నాశనం కనుక ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది దేవీ భాగవతంలో శ్రీమన్నారాయణ నారదుడిని శిష్యుడుగా చేసుకొని మనకు అందించిన రెండు అపూర్వ స్తోత్రాలు గాయత్రీ హృదయం గాయత్రీ కవచం గాయత్రి హృదయం అనే దివ్య స్తోత్రం గాయత్రీ దేవి హృదయాన్ని మన వైపుకు తిప్పే స్తోత్రం ఈ స్తోత్రం వలన ఏ పూట పాపం ఆ పూటే పోతుంది ఏ రాత్రి పాపం అప్పుడే తొలగిపోతుంది సకల దేవతలు అనుగ్రహం లభిస్తుంది తినకూడని పదార్థాలు తింటే వచ్చే పాపాలు తొలగిస్తుంది అతి భయంకరమైన మహా పాపాలు తక్షణం తొలగిపోతాయి గాయత్రీ కవచం పారాయణం వలన వేయి గోవులు దానం చేయడం వచ్చే మహా ఫలితం వస్తుంది. ఏ కష్టాలు ఉండవు నిత్యం భక్తిశ్రద్ధలతో చదవడం వలన సంధ్యావందనం వంటి కార్యక్రమాలు చేయని మహాపాపాల నుండి కూడా విముక్తులవుతారు అని గురువచనము మీన రాశి వారు గోపూజ చేసి గోవుకు ఆహారం సమర్పించిన శనిగ్రహ ము చేత ఇబ్బందులు పడుతున్న లేదా పనులలో జాప్యం జరుగుతున్న తప్పకుండా విముక్తి పొందుతారు