ఆగస్టు 8 శ్రావణమాస శుక్రవారం శుక్లపక్ష చతుర్దశి పగలు 1:44 నిమిషాల వరకు తదుపరి పౌర్ణమి ఉత్తరాషాడ నక్షత్రం పగలు 3 గంటల వరకు తదుపరి శ్రవణా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:16 నుండి 9:07 మద్య గలదు వరమహాలక్ష్మి వ్రత పర్వదినం శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రం ఆనందయోగం ద్రవ్య లాభం శ్రవణ ధూమ్రయోగ మహని కనక పగలు మూడు గంటలలో ప్రయాణాలు అనుకూలం భూమిని దానం ఇచ్చిన వాడికి దానిని ప్రీతితో తీసుకున్న వాడికి పాపాలు నశించిపోతాయి వారు సంతోషంగా నూరు యాగాలు చేస్తే దక్కే పుణ్యం వలన స్వర్గలోకంలో నూరేళ్లు విహరిస్తారు అందుచేత ఏ దానము భూదానానికి సమానం కాదు భూదానం ఇచ్చిన నీకు ఇహ పరలోకాలలో రెండింటిలోనూ కీర్తి పుణ్యము కలుగుతుందని సాక్షాత్తు శ్రీ మహావిష్ణు వామనవతారంలో బలి చక్రవర్తితో పలికాడని గురువచనము వరలక్ష్మి వ్రత పర్వదినాన అన్ని రాశుల వారు వ్రత వైశిష్ట్యాన్ని తెలుసుకొని వ్రతమాచరించి లక్ష్మీదేవి కృపకు పాత్రులు కాగలరు మిత్రులకు శ్రేయోభిలాషులకు నా ఫాలోవర్స్ కి వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు