జూలై 23 ఆషాడ మాస బుధవారం కృష్ణపక్ష చతుర్దశి రాత్రి 2:30 వరకు తదుపరి అమావాస్య ఆరుద్ర నక్షత్రం సాయంత్రం 6:30 వరకు తదుపరి పునర్వాసు నక్షత్రం దుర్ముహూర్తం పగలు 11:40 నుండి 12 31 మధ్య కలదు మాస శివరాత్రి పర్వదినం బుధవారం ఆరుద్ర నక్షత్రం ముసల యోగం భోజనహాని పునర్వాసు గదా యోగం అశుభము కనుక ప్రయాణాలు అనుకూలంగా లేవు ప్రతి మాసములోనూ అమావాస్య ముందు వచ్చే త్రయోదశి తో కూడిన చతుర్దశి మాస శివరాత్రి అందున ఆరుద్ర నక్షత్రంతో కూడి రావడం విశేషం కాబట్టి ప్రదోషకాలం ముందు రుద్రాభిషేకాలు చేసిన మహదేవుని ఆలయాల్లో ప్రదక్షిణాలు చేసిన జమ్మి చెట్టు దగ్గర దీపారాధన చేసిన విశేషమైన ఫలితాలు కనబడతాయి అకాల ప్రమాదాలు అపనిందలు తొలుగుతాయి శత్రు జయము తప్పకుండా కలుగును ముఖ్యంగా ప్రదక్షిణలు నందీశ్వరుడు ధ్వజస్తంభం తో పాటు శివప్రదక్షిణ చేయాలి మసశివరాత్రి రోజు బాగా పాతబడిన శివాలయములో నంది దగ్గర కుడిచేవిలో నందీశ్వర మీ అనుమతితో శివ దర్శనం చేసుకుంటామని అనుమతి తీసుకొని రెండు కొమ్ములు మధ్య ఎడమ చేయి నుంచి శివ దర్శనం చేసుకున్న వారికి శని దోషం నివారణ అవ్వడమే కాకుండా అపవృత్తి భయము తొలగుతుంది