జులై 19 ఆషాడ మాస శనివారం కృష్ణపక్ష నవమి పగలు 1:30 వరకు తదుపరి దశమే భరణి నక్షత్రం రాత్రి 12 14 వరకు తదుపరి కృత్తిక నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 5:37 నుండి 7 21 మధ్య గలదు శనివారం భరణి నక్షత్రం ధ్యాంక్ష యోగం విజ్ఞము కృత్తికా నక్షత్రం ధ్వజయోగం రాజ్య లాభం కనుక రాత్రి 12 15 తర్వాత ప్రయాణాలు అనుకూలం దాతృత్వ మహిమ వర్ణించలేనిది దానమునకు మించినది లేదు అన్నదానము గోదానము వంటి దానాలు నిరంతరం జరుగుతూ ఉండాలి మన వంతు సహాయముగా అవి చేసే వారికి మనం తోడ్పడుతూ ఉండాలి గో సేవ వేద సేవ ఆలయ నిర్వహణ అన్నదానం పురాణ కాలక్షేపం నిరంతరం జరుగుతూ ఉండాలని గురువచనము గోచారంలో గ్రహాలు మాలిక యోగంలో తొమ్మిది గ్రహాలు ఏడు రాశులు సంచారము సింహ కుంభ రాశి వారు శత్రు పీడ తొలగడానికి రుద్రాభిషేకాలు చేయించడం మేష తులా రాశి వారు మాతృమూర్తి కి పాదపూజ చేసిన కీర్తి పెరుగును వృషభ వృశ్చిక రాశి వారు అత్తివృక్షమును ఆరాధిస్తే శుభకార జయం కలుగును మిధున ధనుర్ రాశి వారు సంతాన భాగ్యం కొరకు రావి చెట్టు ప్రదక్షిణ చేస్తే శుభం చేకూరును కర్కాటక మకర రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు వ్యాపార విస్తరణ కోసం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి మీన కన్యా రాశి వారు ఆరోగ్యం కొరకు జమ్మి చెట్టు ప్రదక్షిణ చేసి నువ్వులు దానం చేస్తే చక్కటి ఆరోగ్యాన్ని పొందుతారు