జూలై 14 ఆషాడ మాస సోమవారం కృష్ణపక్ష చవితి రాత్రి 11:50 వరకు తదుపరి పంచమి ధనిష్ట నక్షత్రం ఉదయం 7:40 వరకు తదుపరి శతభిషా నక్షత్రం దుర్ముహూర్తం పగలు 12 30 నుండి ఒకటి 20 మధ్య గలదు సంకష్టహర చతుర్ధి పర్వదినం సోమవారం ధనిష్ట నక్షత్రం శుభయోగం శుభకార్యసిద్ధి శతభిష అమృత యోగం సిరి సంతోషం కనుక ప్రయాణాలు అనుకూలం భక్తులు నాలుగు విధాలుగా ప్రవర్తిస్తారు.
ఆర్త భక్తులు కష్టం ఉన్నప్పుడు మాత్రమే దైవాన్ని ఆరాధించేవారు.జిజ్ఞాస భక్తులుసృష్టి రహస్యం, భగవత్ తత్వం, గురుసేవ గురించి తెలుసుకునేవారు.
*అర్ధార్థ భక్తులు*: – కేవలం ధన ప్రయోజనం కోసం మాత్రమే దైవాన్ని ప్రార్థించేవారు
*జ్ఞాన భక్తులు*:- ప్రతి ప్రాణి ని పరమాత్మ స్వరూపంగా గ్రహించి ఈర్ష్య లేకుండా ప్రేమించేవారు.
వీటికన్నింటికీ అతీతంగా త్రికరణ శుద్ధితో మనసు, వాక్కు, కర్మను సమర్పించేవాడే నిజమైన భక్తుడు.
నీరు బయటికి పోకుండా పూర్తిగా శివలింగం నిండి పోయేలా 1000 కుండలతో నీరు తెచ్చి రుద్రము, నమక చమకాలు, చదువుతూ చేసిన అభిషేక జలాన్ని తలపై, పంట పొలాలలో జల్లడం వలన పూర్వ జన్మ కిలో చేసిన కర్మలన్నీ తొలగిపోతాయి మరియు పంటలు సమృద్ధిగా లభిస్తాయని గురువచనము చతుర్థి తిథినాడు గణేశ భుజంగ స్తోత్రాన్ని చదువుతూ వినాయకుని ప్రదక్షిణ చేస్తే తలపెట్టిన కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది