జూలై 11 ఆషాడమాస శుక్రవారం కృష్ణపక్ష పాడ్యమి రాత్రి 2:02 వరకు తదుపరి విధియా పూర్వాషాడ ఉదయం 6:37 వరకు తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:11 నిమిషాల నుండి 9:09 నిమిషాల మధ్య కలదు శుక్రవారం పూర్వాషాడ నక్షత్రం వర్ధమాన యోగం అధిక లాభం ఉత్తరాషాడ ఆనందయోగం ద్రవ్య లాభం కనుక ప్రయాణాలు అనుకూలం భూమి మీద పుట్టిన ప్రతి జీవికి కొన్ని ధర్మములు ఉన్నాయి అందులో ఒకటి గురువును ఆశ్రయించడం పుడమిలో మనుజులు ఎవరైనా కానీ గురువుల ఉపదేశాలు శ్రద్ధతో ఆలకిస్తే తప్ప తరించలేరు అందుకే రాముడు కృష్ణుడు సమస్తము ఎరిగిన వారైనప్పటికీ నీ జగద్గురువులైనప్పటికీని పరిపూర్ణులైనప్పటికీని గురువుల ఆశ్రయించారు .ఈ జన్మల పరంపర నుండి విముక్తి పొందాలి అంటే సంపూర్ణంగా గురువు యొక్క శరణాగతిని పొందాలి మోక్షాన్ని పొందడం అంత సులభం కాదు కానీ ఎవరైతే గురువుని భగవంతుని సంపూర్ణ శరణాగతి వేడుకుంటారో వారికి మార్గం అత్యంత సులభం అవుతుందని గురవచనము వృషభ కన్య మీన రాశి వారు సాయంత్రం లక్ష్మీదేవి అమ్మవారి గుడిలో మల్లెపూలు సమర్పించి అష్టకాలతో అమ్మవారిని ఆరాధించిన వృత్తి వ్యాపారాలలో విశేషమైన అభివృద్ధి కనపడుతుంది