జూన్ 18 జేష్ఠ మాస బుధవారం
కృష్ణపక్షసప్తమి ఉదయం 10:40
వరకు తదుపరి అష్టమి పూర్వాభాద్ర
నక్షత్రం రాత్రి 10 గంటల వరకు
తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం
దుర్ముహూర్తం పగలు 11 34
నుండి 12 27 మధ్యగలదు
బుధవారం పూర్వభద్ర నక్షత్రం
పద్మయోగం ఐశ్వర్యము
ఉత్తరాభాద్ర లంబయోగం
కార్యహానికనక రాత్రి 10లోపు
ప్రయాణాలు అనుకూలం పెళ్లి
కావలసిన యువతి యువకులు
పిడికిడిలో నవధాన్యాలు తీసుకొని
వీలైనంత వేగముగా108
ప్రదక్షిణలు చేసి చివరి గా
నవధాన్యాలు నవగ్రహాల మీద
చల్లి నట్లయితే వివాహం తప్పకుండా
కలుగును దేవతల గాని నవగ్రహాలు
గాని ప్రదక్షిణ చేసేటప్పుడు
ఎటువంటి పరిస్థితుల్లో నా కూడా
ఇతరులతో మాట్లాడకూడదు
అత్యవసర పరిస్థితులు తప్ప
ప్రదక్షిణలు మౌనంగా శ్రద్ధగా చేయాలని
సహస్రనామాలు లేదా
గురూపదేశ మంత్రాన్ని
స్మరించుకుంటూ చేస్తే అత్యధిక
శుభ ఫలితాలు అతి త్వరలో
సిద్ధిస్తాయని గురువచనము
మీన సింహ కుంభ రాశి వారు
మహాలక్ష్మి అమ్మవారిని మారేడు
దళాలతో పూజించిన ఆభరణ
ప్రాప్తి కలుగును