జనవరి 30 మాఘ మాస గురువారం శుక్లపక్ష పాడ్యమి సాయంత్రం 5: 47 వరకు తదుపరి విదియ శ్రవణా నక్షత్రం ఉదయం 8:51 వరకు తదుపరి ధనిష్ట నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 10:21 నుండి 11:06 మధ్యకలదు గురువారం శ్రవణా నక్షత్రం ధ్వజయోగం రాజ్య లాభం ధనిష్ట నక్షత్రం శ్రీవత్సయోగం లక్ష్మీ ప్రధమ కనక ప్రయాణాలు అనుకూలం పౌర్ణమి అమావాస్య మొదలగు పర్వదినాలలో చేసే అర్చన పూజా జపం రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది సకల పాపాలను తొలగించే పవిత్ర మాసం మాఘ మాసం మఘం ఇంత అమోఘం అవడానికి గల కారణాలు శ్రీదేవి భాగవతంలోనూ బ్రహ్మవైవర్త పురాణంలోనూ వేదవాసుడు వివరించాడు అఘం అంటే పాపం దానిని తొలగించేదే మాఘం అని నిర్వచనమని గురువచనము గోచారంలో కన్యా రాశి వారికి రవి బలము తప్ప మిగిలిన అన్ని గ్రహాలు శుభస్థానాలో సంచారం వలన వీరు సూర్య భగవానుని భక్తిశ్రద్ధలతో ఆరాధించిన ఇష్ట సిద్ధి ప్రాప్తించు.