జనవరి 29 పుష్యమాస బుధవారం కృష్ణపక్ష అమావాస్య సాయంత్రం 6:51 వరకు తదుపరి పాడ్యమి ఉత్తరాషాడ నక్షత్రం ఉదయం 9 :10 వరకు తదుపరి శ్రవణా నక్షత్రం దుర్ముహూర్తం పగలు 11:54 నుండి 12:35 మధ్యగలదు బుధవారం ఉత్తరాషాడ నక్షత్రం వజ్రయోగం కలహం శ్రవణా నక్షత్రం చత్ర యోగం రాజ్య లాభం కనుక ఉదయం 9:10 తర్వాత ప్రయాణాలు అనుకూలం ధన సంబంధమైన రుణాలు మానవులను బాగా పట్టిపీడిస్తుంటాయి ఇతరులు మనకు అప్పు ఉండి అప్పు తీర్చకపోయినా మనం ఇతరులకు ఇవ్వవలసిన సొమ్ము ఇవ్వలేకపోయినా ఈ రెండు రకాలు రుణాలు నుండి విముక్తి పొందడానికి భక్తిశ్రద్ధలతో కుజ స్తోత్రాలు పారాయణం చేయాలని గురువచనము గోచారంలో కన్యా రాశి వారికి అద్భుతమైన సమయము నడుస్తుంది వీరు వ్యాపార లావాదేవీలు మొదలు పెట్టుటకు లేదా విస్తరణలకు శుభకార్యాలు జరుగుటకు బంగారం కొనుటకు ఇల్లు ప్లాట్లు మొదలైన వాటి పైన పెట్టుబడులకు అనుకూలమైన సమయము అద్భుతమైన లాభాలు కలుగుతాయి