జనవరి 3 పుష్య మాస శుక్రవారం శుక్లపక్ష చవితి రాత్రి 12 53 వరకు తదుపరి పంచమి ధనిష్ట నక్షత్రం రాత్రి 12 గంటల వరకు తదుపరి శతభిషా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:47 నుండి 9:31 మధ్య గలదు శుక్రవారం ధనిష్ట నక్షత్రం దాత్రృయోగం కార్యసిద్ధి శతభిషా నక్షత్రం సౌమ్యోయోగం సుఖము కనుక ప్రయాణాలు అనుకూలం కలియుగంలో భగవంతుని అనుగ్రహం శీఘ్రంగా పొందడానికి పురాణ శ్రవణం మించిన గొప్ప మార్గము లేదని వ్యాసభగవానుడు చెప్పాడు ఎన్ని పనులు ఉన్నా కొద్దిసేపైనా పురాణం వినడం లేదా పారాయణం చేయడం తప్పక చేయాలి. దర్భను ధరించి పురాణ ము వినడము జపము చేయడము మరింత పుణ్యప్రదమని శాస్త్రం దర్భ ఇంటిలో ఉండడం వల్ల ఇల్లు కూడా పవిత్రమవుతుందని గురువచనము అన్ని రాశుల వారు శుక్లపక్ష చవితి రోజున గణేశ భుజంగ స్తోత్రాన్ని భక్తిశ్రద్ధలతో పారాయణం చేసి గణేశునికి 108 ప్రదక్షిణలు చేసి గరికతో ఆరాధించిన అభీష్టం తప్పకుండా నెరవేరుతుంది ఇందులో ఎలాంటి సందేహమే లేదు