డిసెంబర్ 24 మార్గశిర మాస మంగళవారం కృష్ణపక్ష నవమి రాత్రి 7:15 వరకు తదుపరి దశమే హస్తా నక్షత్రం పగలు 12 31 వరకు తదుపరి చిత్తా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:42 నుండి 9 26 మధ్యగలదు మంగళవారం హస్తా నక్షత్రం సౌమ్య యోగం సుఖము చిత్తా నక్షత్రం దాంక్షయోగం విజ్ఞము కనుక పగలు 12 30 లోపు ప్రయాణాలు అనుకూలం కన్యరాశిలో చంద్రడు కేతుతో పాటు సంచారము వీరిపై గురు గ్రహం వృషభ రాశిలో రోహిణి నక్షత్రం నుండి వీక్షణ అంతేకాకుండా వీరికి కుజ బుధ శుక్ర శని బలాలు తోడవడం వలన విదేశీ వ్యవహారాలు లేదా ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి మరియు భూములు పైన పెట్టుబడులు ఇల్లు ప్లాట్లు మొదలైన నవి కొనడం అత్యంత శుభ లాభ ప్రదం వీరు వినాయక స్వామి వారిని భక్తిశ్రద్ధలతో భుజంగ స్తోత్రాలతో ఆరాధించిన అనుకూలమైన ఫలితాలు మరింత కలుగుతాయి కర్కాటక మకర రాశి వారు సుబ్రమణ్య స్వామి గుడిలో ప్రదక్షిణలు దీపారాధన మరియు కరావలంబ స్తోత్రం తో స్తుతించడం వలన ఆరోగ్యము మనశ్శాంతి కలుగుతుంది