డిసెంబర్ 14 మార్గశిర మాస శనివారం శుక్లపక్ష చతుర్దశి సాయంత్రం 4:19 వరకు తదుపరి పౌర్ణమి రోహిణి నక్షత్రం తెల్లవారుజామున 4:20 వరకు తదుపరి మృగశిర నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 6:25 నుండి 7:05 మధ్యగలదు శనివారం రోహిణి నక్షత్రం శ్రీవత్స యోగం లక్ష్మీప్రదం కనుక ప్రయాణాలు అనుకూలం వృషభ రాశిలో గురువు రోహిణి నక్షత్ర సంచారము చంద్రుడు కూడా రోహిణి నక్షత్రంలోని సంచారము కనుక చంద్రుడికి రోహిణి మూల త్రికోణము కనుక కర్కాటక సింహ కన్యా రాశి వారికి అద్భుతమైన కాలము నడుస్తున్నది ఈ జరగబోయే మూడు రోజులు వీరు మంచి ఆలోచనలు కార్యరూపములో పెట్టి గట్టి ప్రయత్నం చేస్తే ఏలాంటి అపశకునాలు అవిజ్ఞాలు అపవాదులు ఎదురైన నిర్విఘ్నంగా విజయం సాధించగలరు మరియు ఈ రాశి వారు ముఖ్యంగా చంద్ర నక్షత్రమునందు జన్మించిన వారు అంటే రోహిణి హస్త శ్రవణా నక్షత్రం కూడా ఇందులో చేరుతుంది కనుక శ్రవణా నక్షత్ర జాతకులు అయినా సరే నమ్మిన గురుదేవులను దర్శించుకుని వారికి తగిన సన్మాన సత్కారాలు చేసి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని ప్రయత్నం మొదలుపెడితే తిరుగు లేని విజయాలు చూడగలరు