నవంబర్ 22 కార్తీక మాస శుక్రవారం కృష్ణపక్ష సప్తమి రాత్రి 9 గంటల వరకు తదుపరి అష్టమి ఆశ్లేష నక్షత్రం రాత్రి 8 48 వరకు తదుపరి మఖా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:25 నుండి 9:00 మధ్యగలదు శుక్రవారం ఆశ్లేష నక్షత్రం మృత్యుగం హాని మఖా నక్షత్రం కాలయోగం కార్యహానికనక ప్రయాణాలు అనుకూలంగా లేవు వాయిదా వేసుకోవడం ఉత్తమం కార్తీక మాసంలో స్నానం దానం దీప ప్రజ్వలనం దీపదానం పురాణకథా శ్రవణం చేసి తరించమని శాస్త్రాలు చెబుతున్నాయి కార్తీకమాసం మొత్తం దీపములు వెలిగించిన లేక దానాలు చేసిన ఆయు పెరుగుతుంది కంటిచూపు మెరుగుపడుతుంది ధనం ధాన్యం పుత్ర సంతానం కలుగుతుంది కార్తీకమాసంలో దీపాన్ని వెలిగించడమే దీప దానం కింద లెక్క వస్తుంది. ఇక వెలుగుతున్న దీపాన్ని ప్రదక్షిణతో పాటు విప్రునికి దానం చేస్తే వచ్చే ఫలితం వర్ణించడానికి కూడా వీలు కాదని గురువచనము గోచారంలో ధనుర్ రాశి వారికి శుభ సమయము వీరు వివాహ సంబంధించిన లేదా ఏదైనా శుభకార్యాలకు సంబంధించిన విషయాల గురించి చర్చలు శుభ ఫలితాలు కలగజేస్తాయి వీరు అత్తి వృక్షాన్ని ఆరాధించడం వలన మరింత మేలు కలుగుతుంది.