నవంబర్ 17 కార్తీక మాస ఆదివారం కృష్ణపక్ష ద్వితీయ రాత్రి 11 26 వరకు తదుపరి తృతీయ రోహిణి నక్షత్రం రాత్రి 8 12 వరకు తదుపరి మృగశిరా నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 3:51 నుండి 4:36 మధ్యగలదు ఆదివారం రోహిణి నక్షత్రం దాత్రియోగం కార్యసిద్ధి మృగశిరా నక్షత్రం సౌమ్య యోగం సుఖము కనుక ప్రయాణాలు అనుకూలం ధర్మం అభివృద్ధి చెందడానికి భక్తితో మంత్రపూర్వకంగా రుద్రాక్షను ధరించాలి భస్మమును ధరించిన వాడు రుద్రాక్షను ధరించిన వాడు శివుడికి అత్యంత ప్రీతిపాత్రులు ఈ రెండింటిని ధరించిన వారికి భక్తి ముక్తి తప్పక లభిస్తాయి ఈ రెండింటిని ధరించి పంచాక్షరి జపం చేసేవాడు పరిపూర్ణ శివ భక్తుడు అవుతారని గురువచనం రోహిణి హస్త శ్రవణా నక్షత్రం నందు జన్మించిన వారు గురువులకు పాదాభివందనాలు చేసి సన్మాన సత్కారాలు చేసి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకునిన వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి మరియు అభిష్టపలసిద్ధి తప్పకుండా కలుగును మేష రాశి వారికి కుటుంబ స్థానంలో గజకేసరి వేగం వలన వీరు వ్యాపార విస్తరణలు చేసిన మంచి లాభాలు కనబడుతయు