నవంబర్ 5కార్తీకమాస మంగళవారం శుక్లపక్ష చతుర్థి రాత్రి 9 21 వరకు తదుపరి పంచమి జేష్ట నక్షత్రం ఉదయం 8 వరకు తదుపరి మూలా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి 9:05 మధ్య గలదు నాగుల చవితి పర్వదినం మంగళవారం జేష్ట నక్షత్రం ముద్గరయోగం మరణము మూలా నక్షత్రం ఛత్ర యోగం రాజ్య లాభం కనుక ఉదయం ఎనిమిది తర్వాత ప్రయాణాలు అనుకూలం కార్తీకమాసంలో రావి చెట్టుకు వేప చెట్టుకు ప్రదక్షిణ చేయడం మంచిది. ఆలయంలో స్తంభముల వద్ద ఇతర విగ్రహాల వద్ద చెట్టుకు కొంత దూరంలో మాత్రమే దీపాలు వెలిగించాలి దీపం వెలిగించేటప్పుడు ఒక్క కొబ్బరి నూనె తప్ప మిగిలిన నూనెలు ఉపయోగించవచ్చు ఏ నూనెలో అయినా కొంత ఆవు నెయ్యి వేయడం ద్వారా అది శ్రేష్టమవుతుందని గురువు వచనము వృశ్చిక కర్కాటక కన్యా రాశి వారు బిల్వపత్రాలతో పరమశివుని పూజించడం వలన విశేష ఫలితాలు కనపడతాయి అంతేకాకుండా పార్థివలింగాన్ని తయారుచేసి పంచామృతాలతో పూజించిన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది