Edit Content
Click on the Edit Content button to edit/add the content.

31/01/25 పంచాంగం

జనవరి 31 మాఘ మాస శుక్రవారం శుక్లపక్ష విదియ సాయంత్రం 4:18 వరకు తదుపరి తదియ ధనిష్టా నక్షత్రం ఉదయం 8:10 వరకు తదుపరి శతభిషా నక్షత్రం శుక్రవారం ధనిష్ట నక్షత్రం దాతృయుగం కార్యసిద్ది శతభిషా నక్షత్రం సౌమ్యోగం సుఖము కనుక ప్రయాణాలు అనుకూలం మాఘమాసం శుక్లపక్షంలో పాడ్యమి మొదలుకొని నవమి వరకు వచ్చేటటువంటి ఈ రాత్రులను శ్యామల నవరాత్రులను పిలుస్తారు ఈ కాలంలో అమ్మవారు శ్యామలాదేవి అనే పేరుతో వర్ధిల్లుతుంది ఈ నవరాత్రుల గురించి దేవి భాగవతం ,స్కాంద పురాణంలో నూచెప్పబడినది ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి అమ్మవారి పటాన్ని లేదా విగ్రహాన్ని పూజా మందిరంలో పెట్టుకొని తొమ్మిది రోజులు అమ్మను పూజించి పాయసాన్ని నివేదించిన పెళ్లి కాని యువతీ యువకులకు పెళ్లి అవుతుంది వార్తక్త్యంలో ఉన్నవారు వైదవ్యాలు పొందకుండా సుఖముగా కలిసి ఉంటారు, కుటుంబ వృద్ధి ధన ధాన్య అభివృద్ధి కలుగుతుందని గురు వచనము కర్కాటక రాశి వారు మోదుగ వృక్షము క్రింద మట్టి ప్రమిదలో మూడు వత్తుల చొప్పున ఆవు నీతితో దీపారాధన చేసి చంద్రశేఖరాష్టగాన్ని పఠించిన మానసిక ఆందోళనలు తగ్గుతాయి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top