నవంబర్ 30 కార్తీక మాస శనివారం కృష్ణపక్ష చతుర్దశి ఉదయం 9:35 వరకు తదుపరి అమావాస్య విశాఖ నక్షత్రం పగలు 12:34 వరకు తదుపరి అనురాధ నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 6:16 నుండి 7:44 మధ్య కలదు శనివారం విశాఖ నక్షత్రం శుభ యోగం శుభకార్యసిద్ధి అనురాధ నక్షత్రం అమృత యోగం శ్రీ సంతోషం కనుక ప్రయాణాలు అనుకూలం . రాత్రి లేక ప్రదోషముతో కూడిన చతుర్దశి నాడు శివ దర్శనమునకు శ్రేష్టకాలం చెట్లు తీగలు మొదలగునైనవి స్థావర లింగాలు అంటారు వీటికి నీరు పోసి పోషిస్తే శివుని స్తావరలింగ పూజగా శివుడు భావిస్తాడు పక్షులు జంతువులు జంగమాలు అనబడతాయి వీటిని రక్షించి పోషిస్తే శివ జంగమ లింగ పూజ అవుతుంది ఈ మొత్తం పూజను ప్రకృతి పూజగా అనగా అమ్మ వారి పూజగా శాస్త్రాలు పేర్కొంటున్నాయి ఇది నిజమైన శివ పూజ శివాలయము తుడిచిన కడిగిన వారు లేదా శివుడి కోసం పూలు తోటలో పెంచిన వారు బ్రతికినంత కాలం సంపదలు పొందుతారని గురవచనము కర్కాటక మకర కుంభ మీన రాశి వారు ప్రదర్శకాలమందు శివారాధన వలన శని పీడ తొలిగి శత్రు జయము కార్యసిద్ధి ఆరోగ్యము తో పాటు ఆనందకరమైన సమయాన్ని పొందుతారు