అక్టోబర్ 30 కార్తీక మాస గురువారం శుక్లపక్షణ నవమి తెల్లవారుజామున 4:20 వరకు తదుపరి దశమి శ్రవణా నక్షత్రం పగలు 2:20 వరకు తదుపరి ధనిష్ట నక్షత్రం దుర్మూర్తం ఉదయం 9:50 నుండి 10:35 మధ్యగలదు కోటి సోమవార పర్వదినం గురువారం శ్రవణా నక్షత్రం ధ్వజయోగం రాజ్య లాభం ధనిష్ట శ్రీవత్సయోగం లక్ష్మీ ప్రసన్నం కనక పగల 2:20 తర్వాత ప్రయాణాలు అనుకూలం కార్తీక నవమి నాడు జమ్మి ఆకు గాని మారేడు దళం కాని ఉసిరిక పత్రాలు కానీ లేదా దొరికితే రుద్రాక్ష పత్రం గానీ తీసుకొని సంకల్ప సహిత స్నానం చేసేటప్పుడు నెత్తి మీద పెట్టుకొని స్నానం చేస్తే ఏడు జన్మలో చేసిన పాపాలు నశించిపోతాయి అంతేకాకుండా కురుక్షేత్రంలో కేతు గ్రస్త సూర్యగ్రహణం రోజు స్నానం చేసి సువర్ణ దానం చేసిన ఫలితం లభిస్తుంది శుక్లపక్ష నవమి నాడు స్వయంపాక దానములో మునక్కాడలు ఉండేటట్టుగా చూసుకోవాలి ఉల్లిపాయలు నిషేధం ఇలా చేయడం వలన కుటుంబంలో గల కలహాలు తొలగి ఐక్యమత్యం పెరుగుతుంది స్వయంపాకదానంలో బియ్యము నువ్వులు బెల్లం ఉండేలాగా చూసుకోవాలి. ఇది సూర్యోదయ సమయంలో చేస్తే అత్యంత శుభప్రదం ఈరోజు దామోదర పూజ చేయడం విష్ణు భగవానునికి తులసి మారేడు ఎర్రమందారం పూలచే సహస్రనామాలు తో అర్చించడం వలన విష్ణు కటాక్షం లభిస్తుంది నవమి రోజు జమ్మి ఆకులతో శని భగవానుని పూజిస్తే శని గ్రహ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది శని పీడ తొలగుతుంది శని బాధలు నుండి ముక్తి పొందుతాము అకాల ప్రమాదాలు అపనిందలు అవమానాలు అప మృత్యుభయం లాంటి శని గ్రహం వల్ల కలిగే ఇబ్బందుల నుండి బయట పడతాము లలితా సహస్రనామాలతో అమ్మవారిని పూజిస్తే లలితా పరాభట్టారికి అమ్మవారు అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని గురువచనం