జూన్ 30 ఆషాడ మాస సోమవారం శుక్లపక్ష పంచమి పగలు 11:48 వరకు తదుపరి షష్టి మకా నక్షత్రం ఉదయం 10 16 వరకు తదుపరి పుబ్బా నక్షత్రం దుర్ముహూర్తం పగలు 12 29 నుండి 1:21 మధ్య గలదు స్కంద పంచమి పర్వదినం సోమవారం మఖా నక్షత్రం ద్వాంక్షయోగం విజ్ఞము పుబ్బ నక్షత్రం ధ్వజయోగం రాజ్య లాభం కనుక ఉదయం 10 20 తర్వాత ప్రయాణాలు అనుకూలం సుబ్రహ్మణ్యస్వామి ఈ భూలోకంలో భక్తులను అనుగ్రహించుటకు అనేక నా నామాలతో వెలిశాడు అందులో స్కందూడు అనే పేరున వెలసిన తిధియే స్కంద పంచమి అదే ఆషాడ శుక్ల పంచమి ఆవు పేడతో చేసిన భస్మంతో రుద్రాభిషేకం చేసి ఆ విభూదిని ఒంటికి రాసుకున్న తర్వాత సుబ్రమణ్య స్వామిని అష్టకాలతో ఆరాధించి నువ్వులు బెల్లము దంచి నివేదించి ప్రసాదంలో తీసుకుంటే జాతక దోషాలు అన్ని నివారణై భూ సమస్యలు కోర్టు సమస్యలు అన్నదమ్ముల మధ్య విభేదాలు రుణ బాధలు లాంటి అన్ని ఇబ్బందుల నుండి బయటపడతారు షష్టి దేవి స్తోత్రం పారాయణం చేస్తే సకల సర్ప దోషాలు తొలగి పిల్లలు ఆరోగ్యవంతులై ఆయుష్మంతులవుతారు జాతక చక్రంలో నాగ దోషము కాలసర్ప దోషము లేదా రాహు మార్దశ కేతు మహాదశ జరుగుతున్న వారు విధిగా సుబ్రమణ్య స్వామి గుడిలో కరావలంబ స్తోత్రాలతో పూజించడం వలన దోషాలు గొప్ప యోగాలుగా మారుతాయి