మార్చి 30 శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఉత్తరాయన వసంత రుతు చైత్రమాస ఆదివారం శుక్లపక్ష పాడ్యమి పగల 2:40 వరకు తదుపరి విదియ రేవతి నక్షత్రం సాయంత్రం 6:43 వరకు తదుపరి అశ్విని నక్షత్రం దుర్మూహూర్తం సాయంత్రం 4:30 నుండి 5:19 మధ్య గలదు ఆదివారం రేవతి నక్షత్రం వర్ధమాన యోగం అధిక లాభం అశ్విని నక్షత్రం ఆనందయోగం ద్రవ్య లాభం గనుక ప్రయాణాలు అనుకూలం ఉగాది పర్వదినం నాడు ఉదయత్పూర్వమే నిద్ర లేచి తల స్నానం చేసి భ్రూమధ్యమమున కుంకుమను ధరించి రుద్రాభిషేకం చేసిన లేక విష్ణువుకి పసుపు వర్ణం పూల చేత పూజించిన వారికి ఈ సంవత్సరం మొత్తం ఆర్థికంగా లోటుండదు మరియు నవగ్రహాలకి ప్రదక్షిణలు చేయడం వలన నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఉగాది పచ్చడిని తినడం వలన శరీరంలో గల ఆరు చక్రాలు శుద్ధి కలుగుతాయి తల్లిదండ్రులను గురు దంపతులను పూజించిన సర్వకార్యజయము కలుగుతుంది సంవత్సరంలో జరిగే దుష్ఫలితాలు తోలుగుతాయి పంచాంగ శ్రవణం కచ్చితంగా వినాలి సాయంత్రం ఆలయం కెళ్ళి ఏదో ఒక పురాణ ప్రవచనం వినాలని గురువచనము మిత్రులకు శ్రేయోభిలాషులకు నా ఫాలోవర్స్ కి శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు