Edit Content
Click on the Edit Content button to edit/add the content.

3/02/25 పంచాంగము

ఫిబ్రవరి 3 మాఘ మాస సోమవారం శుక్లపక్ష పంచమి ఉదయం 10 13 వరకు తదుపరి షష్టి రేవతి నక్షత్రం తెల్లవారుజామున 2:38 వరకు తదుపరి అశ్విని నక్షత్రం దుర్ముహూర్తం పగలు 12 36 నుండి 1:02 నిమిషాల మధ్య కలదు వసంత పంచమి పర్వదినం సోమవారం రేవతి నక్షత్రం మాతంగయోగం స్వర్ణ లాభం అశ్విని నక్షత్రం రాక్షస యోగం క్లేషము కనుక రాత్రి 2:30 లోపు ప్రయాణాలు అనుకూలం సకల వేదములు శ్రద్ధతో వినడం వల్ల పారాయణం చేయడం వల్ల ఇతరులకు బోధించడం వల్ల వచ్చే ఫలితం మాఘమాసం మొత్తం స్నానం చేయుట వల్ల పొందుతారు స్నానం చేశాక యథా శక్తిగా దానం చేస్తే మంచిది. ఈశ్వరానుగ్రహం వల్ల అనేక దోషాలు నుండి విముక్తి పొందుతారు మాఘమాసం అంతా భక్తిశ్రద్ధలతో స్నానం చేస్తే సర్వతీర్థములు తిరగడం వల్ల వచ్చే ఫలితం లభిస్తుంది మాఘమాసంలో సూర్యోదయానికి కొద్దిగా ముందు స్నానం చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుందని గురు వచనము వృశ్చిక రాశి వారికి గురు రవి శుక్ర బలాలు తోడవడం వలన వీరు ప్రభుత్వ సంబంధించిన పెండింగ్ లో ఉన్న లేదా మొదలుపెట్టిన పనులు నిర్విఘ్నంగా ముందుకు సాగుతాయి వీరు పరమశివుని అభిషేకాన్ని పాలు సమర్పించితే అత్యధిక ఫలితాలు అది త్వరలో కలుగుతాయి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top