Edit Content
Click on the Edit Content button to edit/add the content.

29/12/25 దధి శంఖ తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవమ్!* *నమామి శశినం సోమం శంభోర్-మకుట భూషణమ్

డిసెంబర్ 29 పుష్య మాస సోమవారం శుక్లపక్ష దశమి తెల్లవారుజామున 3:40 వరకు తదుపరి ఏకాదశి అశ్విని నక్షత్రం రాత్రి 2:40 వరకు తదుపరి భరణి నక్షత్రం ముహూర్తం పగలు 12:24 నుండి 1:08మధ్య గలదు పూర్వాషాఢ కార్తె ప్రారంభం సోమవారం అశ్విని నక్షత్రం రాక్షస యోగం క్లేషము భరణి చర యోగం దుర్వార్త శ్రవణము కనుక ప్రయాణాలు అనుకూలంగా లేవు
దధి శంఖ తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవమ్!* *నమామి శశినం సోమం శంభోర్-మకుట భూషణమ్
దధి శంఖ తుషారాభం: పెరుగు, శంఖం, మంచు (తుషారం) వలె తెల్లని వర్ణం కలవాడు.
క్షీరోదార్ణవ సముద్భవమ్: పాల సముద్రం () నుండి ఉద్భవించినవాడు.
నమామి శశినం సోమం: చంద్రుడికి, సోముడికి నమస్కరిస్తున్నాను.
శంభోర్-మకుట భూషణమ్: శివుని కిరీటానికి అలంకారమైనవాడు (అంటే శివుని శిరస్సుపై చంద్రుడు ప్రకాశిస్తున్నాడు). 
పెరుగు, శంఖం, మంచులా స్వచ్ఛమైన తెల్లని కాంతితో, పాల సముద్రం నుండి జన్మించి, శివుని కిరీటానికి అలంకారంగా ఉన్న చంద్ర భగవానునికి, సోముడికి నమస్కరిస్తున్నాను. 
చంద్రుడు జాతక చక్రంలో అష్టమ స్థానంలో సంచరిస్తుండగా దీనిని చంద్ర దోషంగా తెలుసుకోవాలి శిశువుకి 12 సంవత్సరాల లోపు చంద్రమహదశగాన వస్తే బాల అరిష్ట దోషముగా పరి పరిగణించవచ్చు ఇందుకుగాను మోదుగ చెక్క చేత చేయబడిన ప్రమిదలో మూడవత్తులు అమర్చి ఆవు నెయ్యి చేత అష్టదళ పద్మం ముగ్గు పైన విస్తరవేసి విస్తరణ దోషం గల వారి దోసెలతో నాలుగు దోసెల బియ్యం గుట్టగా బియ్యం పోసి దానిపైన ఈ ప్రమిద నుంచి సోమవారం రోజు చంద్ర నక్షత్రాలు కలిసిన సోమవారం రోజు ఉదయం 6 7 మధ్య దీపారాధన చేసి గణేశుని పూజించి గురు మంత్రాన్ని స్మరించుకొని పై చెప్పబడిన సోమస్తోత్రాన్ని భక్తిశ్రద్ధలతో 108 సార్లు వజ్రాసనంలో జపించాలి ప్రతి సోమవారం రోజు బియ్యం తీసి తీసివేసిన దగ్గర వేరే బియ్యం పోసి తీసివేసిన బియ్యాన్ని దద్దోజనం గా చేసి గుడిలో పంచాలి. ఇలా 41 రోజులు చేసిన తర్వాత తూర్పు పారే నీళ్లల్లో నిమర్జించాలి. దీనివలన చంద్రగ్రహనుగ్రహంతో చంద్ర దోష నివారణ జరిగి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి చంచలమైన మన స్వభావము తగ్గు తుంది ఏకాగ్రత సిద్ధిస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అకాల అపనిందలు అపవాదులు అనుమానాలు అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి

I

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top