నవంబర్ 29 మార్గశిర మాస శనివారం శుక్లపక్షనవమి సాయంత్రం 5:30 వరకు తదుపరి దశమి పూర్వభాద్ర నక్షత్రం రాత్రి 9:50 వరకు తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 6:15 నుండి 7:44 మధ్య గలదు శనివారం పూర్వభాద్ర నక్షత్రం కాలదండ యోగం విజ్ఞము ఉత్తరాభాద్ర ధూమ్రయోగం హానిక ప్రయాణాలు అనుకూలంగా లేవు ఏకాదశి తో కూడిన సోమవారం ద్వాదశి తో కూడిన శనివారం మరియు పంచమితో కూడిన మంగళవారం కొత్త పనులు ప్రయాణాలు చేయకూడదు ఇవి దగ్దయోగాలు అంటారు స్నానం చేయకుండా వంట వండరాదు. అలా వండిన పదార్థాలను తినరాదని శాస్త్రం మరియు ఎంగిలి చేత్తో పోయి వెలిగించడం వంట చేయడం కూడా చేయరాదు అగ్నిదేవుడు సాక్షాత్ నారాయణ స్వరూపుడు ఆయన అనుగ్రహం కలగాలంటే శుచిగా వంట వండాలి అలా చేస్తే ఇంట్లోని వారికి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని గురువచనము మౌడ్యమి అంటే శూన్యం అని అర్థం. అంటే మూఢం అని కూడా అంటారు. అంటే మూఢం ఉన్న రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. నవంబర్ 30 పగలు 1:58 నుంచి ఫిబ్రవరి 13 ఉదయం 11:37లోపు శుక్ర గ్రహాం సూర్యుడికి అతి సమీపంలో ఉంటున్నారు. దీంతో శుక్ర గ్రహాం బలహీనంగా మారిపోతుంటాయి. సాధారణంగా శుభకార్యాలు నిర్వహించడానికి గురు శుక్ర బలం ఎక్కువగా ఉండాలి. అలాగే సంపద లేదా సంతోషంగా ఉండడానికి శుక్ర బలం ఎక్కువగా ఉండాలి. ఈ రెండు గ్రహాల బలం
తగ్గిపోవడంతో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు అని శాస్త్రం. ముఖ్యంగా వివాహాలు, గృహప్రవేశం, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడం, బోర్లు తవ్వించడం వంటివి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు శుక్ర మోద్యములో వస్త్రాల సంబంధించిన మరియు ఆభరణాల సంబంధించిన వ్యాపారాలు తప్ప మిగిలినవి చేసుకోవచ్చని శాస్త్ర. ఫిబ్రవరి 13 తర్వాత వివాహాలు జోరుగా ఉండే అవకాశం ఉంటుంది అవకాశమున్నవారు వివాహ ది శుభకార్యాలు చేసుకునేవారు ముందుగానే జ్యోతిష్యులు సంప్రదించి శుభముహూర్తా నిర్ణయించు కోగలరు