జూలై 29 శ్రావణమాస మంగళవారం శుక్లపక్ష పంచమి రాత్రి 12 48 వరకు తదుపరి షష్టి ఉత్తర పాల్గొని నక్షత్రం రాత్రి 8 వరకు తదుపరి హస్తా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8 14 నుండి 95 మధ్యగలదు గరుడ పంచమి నాగ పంచమి శ్రావణ మంగళ గౌరీ వ్రతం పర్వదినం మంగళవారం ఉత్తరా నక్షత్రం దాత్రృయోగం కార్యసిద్ధి హస్త సౌమ్యయోగం సుఖము కనుక ప్రయాణాలు అనుకూలం శ్రావణమాసం ఎంతో విశేషమైన మాసం ఈ మాసంలో మంగళ గౌరీ పూజలు లక్ష్మీదేవి పూజలను విశేషంగా చేస్తారు శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు లక్ష్మీదేవి లోకాలను ఉద్ధరించడానికి క్షీరసాగరం నుండి అవతరించిందని పురాణ కథలు చెబుతున్నాయి అందుకే శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరమహాలక్ష్మి వ్రతం చేస్తారు ఏదైనా అనివార్య కారణం చేత ఆ శుక్రవారం చేయడానికి కుదరకపోతే తర్వాత వచ్చే శ్రావణ శుక్రవారం వారాలలో ఈ వ్రతం చేసుకోవచ్చునని గురువచనము నాగదోషం కాలసర్ప దోషం లాంటి దోషాలు కలిగి వివాహం ఆలస్యం అవుతున్న లేదా సంతాన విషయంలో ఇబ్బందులు పడుతున్న వారు అత్తివృక్షము గింది గల నాగశిలను విధిగా పూజించి పాలచే అభిషేకించి భక్తిశ్రద్ధలతో సర్పసూక్తాన్ని పఠించి ఆరాధించిన నాగబంధం విముక్తి కలిగి వివాహము కోరుకున్న వారికి వివాహ యోగము సంతానం కా కొరకు ఎదురుచూస్తున్న వారికి సంతాన భాగ్యము ఆరోగ్యంతో ఆయుర్వుర్ది కలుగును